రెనో నుంచి డస్టర్ కొత్త వెర్షన్..
ప్రారంభ ధర రూ.8.46 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో తాజాగా ఎస్యూవీ డస్టర్లోనే కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8.46-రూ.13.56 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. దీనితోపాటు కంపెనీ సిక్స్-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వేరియంట్‌ను కూడా మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.11.66 లక్షలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్స్ ధరలు రూ.8.46 లక్షలు-రూ.9.26 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్స్ ధరలు రూ.9.26 లక్షలు-రూ.13.56 లక్షల శ్రేణిలో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఎస్యూవీ విభాగంలో వాటా మరింత పెంచుకోవడానికి కొత్త డస్టర్ తమకు దోహదపడుతుందని రెనో ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో సుమిత్ సావ్నే తెలిపారు. కొత్త వెర్షన్ డ స్టర్‌కు నేటి నుంచి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. కొత్త డస్టర్‌లో రియర్ వ్యూ కెమెరా, ఆటోమెటిక్ ఎయిర్ కండీషనింగ్, మీడియా నావిగేషన్, ఏబీఎస్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.