
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 600 ఎకరాల్లోని చెన్నై ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి.
ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment