new milestone
-
మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే..
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన 'టీవీఎస్ రైడర్ 125' బైక్.. అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 2021లో లాంచ్ అయిన తరువాత మొత్తం 10,07,514 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. మూడేళ్ళ కాలంలో ఈ బైక్ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.గత ఆర్ధిక సంవత్సరం నాటికి టీవీఎస్ రైడర్ మొత్తం 7,87,059 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2,12,941 యూనిట్ల సేల్స్ సాధించింది. మొత్తం మీద ఈ బైక్ సేల్స్ 10 లక్షల యూనిట్లు దాటేసింది.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ బైక్ ఐజీఓ ఎడిషన్ రూపంలో రూ. 98,389 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. ఇది 124.8 సీసీ ఇంజిన్ కలిగి 11.22 Bhp పవర్, 11.75 Nm టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. -
దుమ్ము రేపిన రెనో-నిస్సాన్ , సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 600 ఎకరాల్లోని చెన్నై ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. -
ఉత్పత్తిలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇచ్చిన 'టాటా పంచ్'
Tata Motors: ఎక్కువమంది ప్రజలకు నమ్మికైన భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఇప్పటికే అనేక ఆధునిక ఉత్పత్తులు ప్రవేశపెట్టి తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ టాటా పంచ్ మైక్రో SUV ఉత్పత్తిలో కొత్త రికార్డ్ సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ న్యూ రికార్డ్.. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి సేఫ్టీలో కూడా అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధించింది. ఈ కారణంగానే ఈ కారు అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారు ఉత్పత్తిలో 'రెండు లక్షల' యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వారియర్ అవుతోంది. 2021 అక్టోబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన టాటా పంచ్ కేవలం 20 నెలల కాలంలో ఉత్పత్తిలో ఏకంగా 2,00,000 మైలురాయిని చేరుకుంది. ఇందులో కంపెనీ 2023 మార్చి వరకు 1,86,535 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 10,930 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి ఇప్పుడు ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. టాటా పంచ్ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ALFA) ఆర్కిటెక్చర్ మీద రూపొందించారు. కావున ఇది అద్భుతమైన డిజైన్ అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ఆటోమాటిక్ ప్రొజెక్టర్ హెడ్లాంప్, LED DRL, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, రియర్ వ్యూ కెమరా, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మోంటెడ్ కంట్రోల్స్, USB ఛార్జింగ్ సాకేట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఇది 5 స్టార్ రేటింగ్ పొంది దేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) టాటా పంచ్ సిఎన్జి (Tata Punch CNG) ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇది మార్కెట్లో విడుదలైతే టాటా సిఎన్జి విభాగంలో నాల్గవ మోడల్ అవుతుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ కలిగి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సిఎన్జి ట్యాంకుల కోసం కంపెనీ కొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!) టాటా పంచ్ ఎలక్ట్రిక్ (Tata Punch EV) ఇక టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలకావడానికి కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల వెలువడ్డాయి. ఇది కూడా మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. టాటా పంచ్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
Okinawa: కొత్త రికార్డ్ బద్దలు కొట్టిన ఒకినావా
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన 'ఒకినావా' (Okinawa) ఉత్పత్తిలో ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల కంపెనీ తన 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రో ఆఫ్ ప్రొడక్షన్ రాజస్థాన్‌లోని తన ప్లాంట్ నుండి విడుదల చేసింది. 2015 భారతదేశంలో తన కార్య కలాపాలను ప్రారంభించిన ఒకినావా, ఉత్పత్తిలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అంటే కంపెనీ 2,50,000 వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది. 2015లో కార్యకలాపాలను ప్రారభినప్పటికీ 2017లో ఒకినావా రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. తరువాత 2019లో భారత ప్రభుత్వం నుంచి మొదట ఫేమ్ II సబ్సిడీని పొందిన ఘనత దక్కించుకుంది. క్రమంగా మార్కెట్లోకి ఐప్రైస్ ప్లస్, ప్రైస్ ప్రో, లైట్, ఆర్30 వంటి వాటిని విస్తరించింది. 2021లో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన ఒకినావా అదే సంవత్సరంలో గెలాక్సీ స్టోర్లను ప్రారంభించింది. కాగా 2022లో కంపెనీ OKHI-90 తీసుకురావడమే కాకుండా రాజస్థాన్‌లోని రెండవ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ 2025 నాటికి 1000 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను విస్తరించాలని దానికనుగుణంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) ఒకినావా, టాసిటా (Tacita)తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో మరో మూడేళ్లలో రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టడానికి యోచిస్తోంది. ఇది జరిగితే త్వరలోనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 2025 నాటికి ఉతప్పటిలో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. -
స్టాక్మార్కెట్లో కొనుగోళ్ల జోష్
ముంబై : ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో పాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్టస్థాయికి చేరింది. ఐటీ, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. వేదాంత, టాటా స్టీల్ సహా పలు షేర్లు భారీగా లాభపడుతుండగా యస్ బ్యాంక్ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనయింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 40,315 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 54 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి
సాక్షి, చీపురుపల్లి : పలకరించే జనం.. పరుగులు పెట్టే అభిమానం.. ఉరకలేసే ఉత్సాహం.. ప్రతి పల్లెలోనూ ఇదే సందడి. ప్రతి మనసులోనూ ‘అన్నొస్తున్నాడు’ అనే ఆనందం.. పుట్టెడు కష్టాలు చెప్పే వాళ్లు.. గుండె లోతుల్లోంచి ఆప్యాయతను పంచే ప్రజానీకం.. పూలబాటలు.. మంగళహారతులు.. ఇవీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో కనిపించే దృశ్యాలు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో రాజన్న తనయుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. (డొంక కదులుతుందనే భయమా?) ప్రజాసంకల్పయాత్ర @3100 కిమీ: వెల్లువలా జనం వెంట నడువగా విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం ఆనందపురం క్రాస్ వద్ద ప్రజాసంకల్పయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఆనందపురం క్రాస్ వద్ద ఈ మైలురాయికి గుర్తుగా జననేత వేప మొక్కను నాటారు. 281 వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత సోమవారం గుర్ల శివారు, కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్, అనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకూ నేటి యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర సాగిన రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు మండుటెండ.. ఉక్కపోత. జనం ఇవేవీ లెక్కచేయ లేదు. అడుగు కూడా ఖాళీ కన్పించనంతగా జనం కిక్కిరిసిపోయారు. తమనేతను కలవాలని, కష్టాలు చెప్పుకోవాలని పోటీపడ్డారు. ఆయన రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. మేడలు, చెట్లు, గోడలు, స్తంభాలు.. ఎక్కారు. అక్కడి నుంచి జగన్ స్పష్టంగా కన్పించారంటూ సంతోషించారు. (అసలైన నాయకుడు ఆయనే...) చదవండి: అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే -
ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.
సాక్షి, విజయనగరం: కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేత జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను జననేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను అక్కడ నాటారు. చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జననేత పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి. కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు 0- వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయ 500- అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు 1000- నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం 1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు 2000- పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి 2500- తూర్పు గోదావరి జిల్లా పసలపూడి శివారు 3000- విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం -
సరికొత్త వెర్నా లాంచ్: మరో మైలురాయికి హ్యుందాయ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్ ఇండియా మరో మైలురాయిని అధిగమించింది. మంగళవారం దేశీయ మార్కెట్లో న్యూ జనరేషన్ వెర్నాను లాంచ్ చేసింది. దీంతో ఇప్పటివరకు విడుదల చేసిన హ్యుందాయ్ కార్ల సంఖ్య 50లక్షలకు చేరింది. ఆధునిక ప్రీమియం బ్రాండ్ దిశగా వినియోగదారుల ఆకాంక్షలకనుగుణంగా ప్రపంచస్థాయి, బెంచ్‌మార్క్ ఉత్పత్తులను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై.కె. కో ప్రకటించారు. కస్టమర్లు, భాగస్వాములు, నిపుణులచే అత్యంత ప్రియమైన, విశ్వసనీయ బ్రాండ్ గా పేరొందిన హ్యుందాయ్ 5 లక్షల మైలు రాయిని తాకడం సంతోషంగా ఉందన్నారు. దేశీయ కార్ సెగ్మంట్లో వేగమైన వృద్ధిని హ్యుందాయ్ నమోదు చేస్తోందని ప్రకటించారు. తమ 50లక్షలవ న్యూ జనరేషన్ వెర్నా లాంచింగ్‌తో మార్కెట్లో కస్టమర్లను ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ దీర్ఘకాలిక నిబద్ధత వెల్లడైందన్నారు. దేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న హ్యుందాయ్ 1998లోఉత్పత్తిని ప్రారంభించింది. వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన కేవలం ఎనిమిది సంవత్సరాల, ఏడు నెలలకాలంలోనే మొట్టమొదటి మిలియన్ కారు శాంత్రను విడుదల చేసింది. 2013 జూలైలో మూడు మిలియన్ల మార్క్‌ను, నవంబర్ 2015 లో 4 మిలియన్ మార్కును చేరుకుంది. కాగా హ్యుందాయ్ శాంత్రో, ఇయాన్, వెర్నా, క్రెటా, ఐ 10 గ్రాండ్, ఎలైట్ ఐ 20 , ఐ20 యాక్టివ్, యాక్సెంట్, టక్సన్, ఎలంత్రా లాంటి మోడల్స్‌ను అందుబాటులోకి తెస్తున్న హ్యుందాయ్ గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా , ఆసియా పసిఫిక్ తదితర 87 దేశాలకు తన వాహనాలను రవాణా చేస్తుంది. -
ఫేస్ బుక్ మరో కొత్త మైలురాయి
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. నెలకు తమ కంపెనీకి యాక్టివ్ యూజర్లు 200 కోట్లకు పైగా ఉన్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. 100 కోట్ల మార్కును తాకిని తర్వాత ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఫేస్ బుక్ ఈ స్థాయిని చేధించినట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. ''మీతో కలిసి ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది'' అని ఫేస్ బుక్ సహవ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్కు జుకర్ బర్గ్ తెలిపారు. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని కంపెనీ తెలిపింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది. మార్చి 31 వరకు ఫేస్ బుక్ రు 1.94 బిలియన్ యూజర్లున్నారు. గతేడాది కంటే ఇది 17 శాతం ఎక్కువ. 2012లో అక్టోబర్ లో తొలిసారి ఫేస్ బుక్ 100 కోట్ల మైలురాయిని చేధించింది. ప్రస్తుతం మరో కొత్త మైలురాయి 200 కోట్లను ఫేస్ బుక్ అధిగమించేసింది. ప్రతిరోజు 175 మిలియన్ కు పైగా యూజర్లు లవ్ రియాక్షన్లను షేర్ చేసుకుంటున్నారని ఫేస్ బుక్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. కాగ, గత 30 రోజుల కాలంలో వెబ్ సైట్ లేదా మొబైల్ డివైజ్ లలో తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను సందర్శించే రిజిస్ట్రర్ యూజర్ల బట్టి నెలవారీ యాక్టివ్ యూజర్లను లెక్కిస్తారు. అయితే ఫేస్ బుక్ కంపెనీ వృద్ధి ఎక్కువగా అమెరికా వెలుపల దేశాల్లోనే ఉన్నట్టు తెలిసింది. ఫేస్ బుక్ కు చెందిన యూజర్లు ఇన్ స్టాగ్రామ్ కు ఏప్రిల్ నెలలో 700 మిలియన్ మంది యూజర్లున్నారు.