ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన 'ఒకినావా' (Okinawa) ఉత్పత్తిలో ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల కంపెనీ తన 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రో ఆఫ్ ప్రొడక్షన్ రాజస్థాన్‌లోని తన ప్లాంట్ నుండి విడుదల చేసింది.
2015 భారతదేశంలో తన కార్య కలాపాలను ప్రారంభించిన ఒకినావా, ఉత్పత్తిలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అంటే కంపెనీ 2,50,000 వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది.
2015లో కార్యకలాపాలను ప్రారభినప్పటికీ 2017లో ఒకినావా రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. తరువాత 2019లో భారత ప్రభుత్వం నుంచి మొదట ఫేమ్ II సబ్సిడీని పొందిన ఘనత దక్కించుకుంది. క్రమంగా మార్కెట్లోకి ఐప్రైస్ ప్లస్, ప్రైస్ ప్రో, లైట్, ఆర్30 వంటి వాటిని విస్తరించింది.
2021లో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన ఒకినావా అదే సంవత్సరంలో గెలాక్సీ స్టోర్‌లను ప్రారంభించింది. కాగా 2022లో కంపెనీ OKHI-90 తీసుకురావడమే కాకుండా రాజస్థాన్‌లోని రెండవ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ 2025 నాటికి 1000 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను విస్తరించాలని దానికనుగుణంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
(ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ)
ఒకినావా, టాసిటా (Tacita)తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో మరో మూడేళ్లలో రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టడానికి యోచిస్తోంది. ఇది జరిగితే త్వరలోనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 2025 నాటికి ఉతప్పటిలో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment