పెట్రోల్, డీజిల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కావున ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరుగుతోంది. ఈవీలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత వసూలు చేస్తుంది, భారత్ ఈ జాబితాలో ఏ స్థానంలో ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల కోసం వసూలు చేసే చార్జీలు డెన్మార్క్ అండ్ ఇటలీలో గరిష్టంగా రూ. 1823 వరకు ఉంది. అయితే తక్కువ వసూలు చేసే దేశాల జాబితాలో అర్జెంటీనా (రూ. 113), మలేషియా (157) తరువాత భారత్ ఉండటం గమనార్హం. మన దేశంలో ఈవీ ఛార్జ్ రూ. 231 మాత్రమే.
ప్రపంచంలోని 50 దేశాల మీద జరిగిన పరిశోధనలో కొత్త హ్యుందాయ్ కోనా ఈవీ 100 కిమీ ప్రయాణించడానికి కావలసిన ఛార్జ్ చేసుకోవడానికి ఎంత వసూలు చేస్తారనేదానిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇతర వాహనాలతో పోలిస్తే ఎంత తక్కువ ఖర్చు అవుంతుందనేది కూడా దీని ద్వారా బేరీజు వేసుకోవచ్చు.
ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్..
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఇండియాలో రూ. 231 వసూలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి యూరప్ దేశాల్లో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు 100 కిమీ ప్రయాణించడానికయ్యే ఖర్చు రూ. 76 మాత్రమే అని కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ డీజిల్ లేదా పెట్రోల్ కారు ప్రయాణించాలంటే సుమారు రూ. 500 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఉదాహరణకు ఇంధన ధరలు లీటరుకు రూ. 100 అనుకుంటే.. 20కిమీ/లీ అందించే కారు 100 కిమీ ప్రయాణించడానికి రూ. 500 ఖర్చవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ కారు వినియోగం వల్ల ఎంత ఆదా చేయవచ్చనేది ఇట్టే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment