chage
-
ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు
పెట్రోల్, డీజిల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కావున ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరుగుతోంది. ఈవీలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత వసూలు చేస్తుంది, భారత్ ఈ జాబితాలో ఏ స్థానంలో ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల కోసం వసూలు చేసే చార్జీలు డెన్మార్క్ అండ్ ఇటలీలో గరిష్టంగా రూ. 1823 వరకు ఉంది. అయితే తక్కువ వసూలు చేసే దేశాల జాబితాలో అర్జెంటీనా (రూ. 113), మలేషియా (157) తరువాత భారత్ ఉండటం గమనార్హం. మన దేశంలో ఈవీ ఛార్జ్ రూ. 231 మాత్రమే. ప్రపంచంలోని 50 దేశాల మీద జరిగిన పరిశోధనలో కొత్త హ్యుందాయ్ కోనా ఈవీ 100 కిమీ ప్రయాణించడానికి కావలసిన ఛార్జ్ చేసుకోవడానికి ఎంత వసూలు చేస్తారనేదానిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇతర వాహనాలతో పోలిస్తే ఎంత తక్కువ ఖర్చు అవుంతుందనేది కూడా దీని ద్వారా బేరీజు వేసుకోవచ్చు. ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్.. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఇండియాలో రూ. 231 వసూలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి యూరప్ దేశాల్లో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదీ చదవండి: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ! భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు 100 కిమీ ప్రయాణించడానికయ్యే ఖర్చు రూ. 76 మాత్రమే అని కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ డీజిల్ లేదా పెట్రోల్ కారు ప్రయాణించాలంటే సుమారు రూ. 500 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఉదాహరణకు ఇంధన ధరలు లీటరుకు రూ. 100 అనుకుంటే.. 20కిమీ/లీ అందించే కారు 100 కిమీ ప్రయాణించడానికి రూ. 500 ఖర్చవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ కారు వినియోగం వల్ల ఎంత ఆదా చేయవచ్చనేది ఇట్టే అర్థమవుతుంది. -
25 నుంచి విమానాల రాకపోకల షెడ్యూల్లో మార్పు
సాక్షి, కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలకు సంబంధించి మార్చి 25 నుంచి షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి ఎయిర్‌పోర్టుతోపాటు ట్రూజెట్ సంస్థకు సంబంధించి సమాచారం అందింది. ప్రస్తుతం నడిచే వేళల్లో కూడా కొద్దిపాటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే విమానం చెన్నై మీదుగా తమిళనాడులోని సేలంకు కూడా వెళుతుంది. దీనికి సంబంధించి సేలం వెళ్లే ప్రయాణీకులు కడప ఎయిర్‌పోర్టులో టిక్కెట్టుతోపాటు సమయం వివరాలు తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. అందుకు సంబంధించి మార్చి 25 నుంచి విమాన రాకపోకల వివరాలు, సమయం ఇలా ఉండబోతోంది. విజయవాడలో విమానం బయలుదేరే సమయం ఉదయం 8.05 కడపకు చేరుకునే సమయం ఉదయం 9.05 కడప నుంచి విజయవాడ బయలుదేరే సమయం ఉ.. 9.25 విజయవాడకు చేరుకునే సమయం ఉ.. 10.30 చెన్నై నుంచి కడపకు విమానం బయలుదేరు సమయం మధ్యాహ్నం 12.30 కడపకు చేరుకునే సమయం మ.. 1.30 కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం మ.. 1.55 హైదరాబాదుకు చేరుకునే సమయం మ.. 3.00 హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం మ..3.30 కడపకు చేరుకునే సమయం సాయంత్రం 4.35 కడప నుంచి చెన్నైకి బయలుదేరు సమయం సా.. 4.55 చెన్నైకి చేరుకునే సమయం సా.. 5.55 -
నిందితుడికి సహకరించాడనే శ్రీనివాస్ హత్య
12 రోజుల్లో హత్య కేసు ఛేదించిన పెద్దాపురం పోలీసులు ఆరుగురు అరెస్టు తపంచా, నాలుగు బైక్‌లు స్వాధీనం పెద్దాపురం : సుమారు 12 రోజుల కిందట ప్రత్తిపాడు–సామర్లకోట రహదారిలో గోరింట–పులిమేరు గ్రామాల మధ్య జరిగిన కాంగ్రెస్ కార్యకర్త బర్రే శ్రీనివాస్ హత్య మిస్టరీని పెద్దాపురం పోలీసులు ఛేదించారు. గత ఏడాది పెద్దాపురం వైస్ ఎంపీపీ గోపు సతీష్ రాజా హత్య కేసులో నిందితులకు సహకరించాడన్న కారణంగా కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్‌ను హత్య చేసిన వివరాలను సోమవారం రాత్రి అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖరరావు, సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్లతో కలిసి స్థానిక విలేకర్లకు తెలిపారు. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన బర్రే శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన దివంగత వైస్ ఎంపీపీ సతీష్ రాజాను హత్య చేసిన కొప్పిరెడ్డి అచ్చిరాజుకు సహకరించడంతో అదే గ్రామానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు పాల్పడ్డారు. తాటిపరి్తకి చెందిన కొమ్మిరెడ్డి వరహా కొండలరావు అలియాస్ బుజ్జి అదే గ్రామానికి చెందిన బండి మహేష్‌కుమార్, కందుకూరి నాగేంద్ర, కందుకూరి శ్రీను, సమ్మిటి సూర్య గంగాధర్‌తో కలిసి శ్రీనివాస్ హత్యకు పథకం పన్నారు. మహేష్‌తో పరిచయం ఉన్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన మామిడి ధనుంజయరావుతో కలిసి మూడు లక్షల రూపాయలకు హత్య చేయడానికి బేరం కుదుర్చుకుని 30 వేల రూపాయలు అడ్వా¯Œ్సగా ఇచ్చారు. పథకం ప్రకారం ఈ నెల 12వ తేదీన కాకినాడ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న శ్రీనివాస్‌ను వెంబడిస్తూ బుజ్జి ఎప్పటికప్పుడు ధనుంజయరావు, మహేష్, నాగేంద్ర, గంగాధర్‌లకు వడ్లమూరులోని వై¯ŒS షాపు వద్ద కాపలా ఉన్న వారికి సమాచారం అందించేవాడు. అటుగా సెల్ఫో¯ŒSలో మాట్లాడుతూ వస్తున్న శ్రీనివాస్ దుకాణం దాటగానే శ్రీను, గంగాధర్‌లు అతని బైక్‌ను ఓవర్టేక్ చేసి ఆపారు. వెనుక నుంచి ధనుంజయరావు తల వెనుక తుపాకి ఉంచి ఒక రౌండ్ కాల్చగా శ్రీనివాస్ బైక్ నుంచి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడ నుంచి పరారైన ఆరుగురినీ సీఐ వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ దామోదర్ తెలిపారు. వారి నుండి ఒక తపంచా, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకుని ఆరుగురుని కోర్టుకు తరలించనున్నామన్నారు. కేసును 12 రోజుల్లో ఛేదించిన సీఐ వీరయ్యగౌడ్, హెచ్‌సీలు వై.కృష్ణ, పీవీ కుమార్, వి.విజయ్‌బాబు, కె.జయకుమార్, ఐ.గణేష్, ఎ¯ŒS.శ్రీనివాస్ చౌదరి, ఎంఎస్బి విజయ్‌లకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు. ఎస్ఐలు కృష్ణభగవాన్, ఎం.ఏసుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిల్లర కష్టాలు
తణుకు(పశ్చిమ గోదావరి జిల్లా): ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి మార్కెట్లో కూరగాయల కొనుగోలు, బస్సు ప్రయాణం ఇలా ప్రతిచోట చిల్లర అవసరం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి, రెండు, అయిదు రూపాయల నాణేలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పడంలేదు. చిల్లర లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూటికి రూ.10 కమీషన్ చెల్లించి చిల్లర నాణేలు కొనుగోలు చేసి వ్యాపారాలు సాగించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గినా మార్కెట్లో మాత్రం నిత్యం రూపాయి చిల్లర నాణెం లేనిదే వ్యాపార లావాదేవీలు ముందుకు సాగడంలేదు. వ్యాపారం కుదేలు మార్కెట్లో చిల్లర కొరత కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. నిత్యం చిల్లర లేకపోతే రూపాయి, రెండు వంటి చిల్లరను కొన్ని సందర్భాల్లో వ్యాపారులు వదులుకోవాల్సిన పరిస్థితి. రూపాయి తక్కువైనా పర్లేదు కానీ చిల్లర చెల్లించి సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజలు వస్తువుల కొనుగోలుకు 10, 20, 50, 1,00, 5,00, 1,000 నోట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో హోటళ్లు, మెడికల్, కిరాణా, కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు చిల్లర కోసం ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సుల్లో అయితే కండక్టర్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు షాపుల్లో చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చి సరి చేసుకుంటున్నారు. బ్యాంకులు కొంత మేర చిల్లరను ప్రత్యేక కౌంటర్ల ద్వారా మేళాలు ఏర్పాటు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటికీ వ్యాపారుల పూర్తి అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. దీంతో 90 శాతం వ్యాపారులు మాత్రం చిల్లర నాణేలు కమీషన్ పద్ధతిలో సమకూర్చుకోవడం చిరు వ్యాపారులకు భారంగా మారుతోంది. రోజువారి సంపాదనలో కొంత మొత్తం చిల్లర కొనుగోలుకే వెచ్చించాల్సివస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. చిల్లరవ్యాపారం నిత్యం రూ.అర కోటి చిల్లర కొరతను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రూ.100 విలువ చేసే చిల్లర కావాలంటే అదనంగా రూ.పది తీసుకుంటున్నారు. సర్వసాధారణంగా కనిపించే చిల్లర వ్యాపారం ద్వారా నిత్యం రూ.50 లక్షల మేర కమీషన్ చేతులు మారుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర నాణేలు విక్రయించేందుకు ప్రత్యేక వ్యాపారులు ఉండగా కొందరు కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీల దుకాణాల్లో చిల్లర వ్యాపారం జరుగుతోంది. దేవాలయాల్లో హుండీలను తెరిచే సమయంలో అక్కడి అధికారులకు సైతం ‘కమీషన్’ చెల్లించి మరీ చిల్లర కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వ్యాపారులు బిక్షాటన చేసే వారి వద్ద నుంచి చిల్లర తీసుకుని వారికి నోట్లు ఇస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు చిల్లర నాణేలు అందించే మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అది పాటించడంలేదు. కష్టాలు తప్పడం లేదు ప్రస్తుతం ఏ వస్తువు కొనుగోలు చేసినా ఎమ్మార్పీలు చిల్లర మొత్తంలోనే ఉంటున్నాయి. వాటి కొనుగోలు అనంతరం ప్రజలకు చిల్లర ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక కమీషన్ రూపంలో చిల్లర కొనుగోలు చేసి కొనుగోలుదారులకు ఇస్తున్నాం. – వి.సూర్యనారాయణ, కిరాణా వ్యాపారి, వేల్పూరు 10 శాతం కమీషన్ ఇచ్చి కొంటున్నాం నా దుకాణంలో ప్రతి రోజు రూ.వెయ్యి వరకు చిల్లర అవసరమవుతుంది. అయితే చిల్లర కొరత కారణంగా కొన్ని సందర్భాల్లో బేరాలు వదులుకుంటున్నాం. దీంతో భారమైనా రూ.10 శాతం కమీషన్ ఇచ్చి చిల్లర కొనుగోలు చేస్తున్నాం. – వైసీహెచ్ కృష్ణమూర్తి, వ్యాపారి