Okinawa
-
Okinawa: కొత్త రికార్డ్ బద్దలు కొట్టిన ఒకినావా
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన 'ఒకినావా' (Okinawa) ఉత్పత్తిలో ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల కంపెనీ తన 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రో ఆఫ్ ప్రొడక్షన్ రాజస్థాన్‌లోని తన ప్లాంట్ నుండి విడుదల చేసింది. 2015 భారతదేశంలో తన కార్య కలాపాలను ప్రారంభించిన ఒకినావా, ఉత్పత్తిలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అంటే కంపెనీ 2,50,000 వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది. 2015లో కార్యకలాపాలను ప్రారభినప్పటికీ 2017లో ఒకినావా రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. తరువాత 2019లో భారత ప్రభుత్వం నుంచి మొదట ఫేమ్ II సబ్సిడీని పొందిన ఘనత దక్కించుకుంది. క్రమంగా మార్కెట్లోకి ఐప్రైస్ ప్లస్, ప్రైస్ ప్రో, లైట్, ఆర్30 వంటి వాటిని విస్తరించింది. 2021లో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన ఒకినావా అదే సంవత్సరంలో గెలాక్సీ స్టోర్లను ప్రారంభించింది. కాగా 2022లో కంపెనీ OKHI-90 తీసుకురావడమే కాకుండా రాజస్థాన్‌లోని రెండవ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ 2025 నాటికి 1000 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను విస్తరించాలని దానికనుగుణంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) ఒకినావా, టాసిటా (Tacita)తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో మరో మూడేళ్లలో రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టడానికి యోచిస్తోంది. ఇది జరిగితే త్వరలోనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 2025 నాటికి ఉతప్పటిలో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. -
ఒకినావా రూ.220 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఒకినావా ఆటోటెక్ కొత్త మోడళ్లు, పవర్ట్రైన్ అభివృద్ధికి రూ.220 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇటలీలో నెలకొల్పిన పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో నూతన మోడళ్లకు రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించింది. జేవీ భాగస్వామి అయిన టాసిటాతో కలిసి ఈ ఆర్అండ్డీ ఫెసిలిటీని కంపెనీ ఏర్పాటు చేసింది. ఇటలీ కేంద్రం నుంచి రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ మోటార్‌సైకిల్ ఈ ఏడాదే భారత్‌లో అడుగుపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికను భారత్‌కు తీసుకు వచ్చేందుకే ఆర్అండ్డీ సెంటర్ స్థాపించినట్టు తెలిపింది. గడిచిన అయిదేళ్లలో రూ.500 కోట్లు పెట్టుబడి చేసినట్టు ఒకినావా ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు. తదుపరితరం పవర్ట్రైన్ ను ఇటలీ కేంద్రంలో అభివృద్ధి చేస్తామన్నారు. చదవండి: Air India: ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా.. దాదాపు 8 వేల మందికి -
ఇటలీ సంస్థతో ఒకినావా ఆటోటెక్ జట్టు!
ముంబై: ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒకినావా ఆటోటెక్ వెల్లడించింది. దీని ప్రకారం స్కూటర్లు, మోటర్‌సైకిళ్లతో పాటు దేశ, విదేశీ మార్కెట్లకు పవర్ట్రెయిన్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయనున్నారు. భారత్ కేంద్రంగా జేవీ ఏర్పాటవుతుందని, రాజస్థాన్‌లోని తమ రెండో ప్లాంటులో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది తయారు చేసే వాటిలో ఒక స్కూటర్, హై–ఎండ్ మోటర్‌సైకిల్ మోడల్ ఉంటాయని ఆయన వివరించారు. ప్రథమార్ధంలో డిజైనింగ్, అభివృద్ధి మొదలైన పనులు చేపట్టనున్నట్లు శర్మ చెప్పారు. టేసిటా సొంతంగా పవర్‌ట్రెయిన్, కంట్రోలర్, మోటర్, బ్యాటరీ ప్యాక్‌లు మొదలైన వాటిని డిజైన్ చేసుకుని, ఉత్పత్తి చేస్తుంది. జేవీలో భాగంగా టేసిట్ పవర్‌ట్రెయిన్ మొదలైనవి అందించనుండగా స్థానికంగా ఉత్పత్తి అభివృద్ది, తయారీని ఒకినావా చేపడుతుంది. మార్కెట్‌పై గట్టి పట్టు ఉన్న ఒకినావాతో జట్టు కట్టడంపై టేసిటా ఎండీ పీర్పాలో రిగో సంతోషం వ్యక్తం చేశారు. -
ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అప్రమత్తమైంది. తమ కంపెనికి చెందిన స్కూటర్లను రీకాల్ చేస్తామంటూ ప్రకటించింది. 2022 మార్చి 26న తమిళనాడులో ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒకినావా స్కూటు తగలబడి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనంగా మారింది. మరో రెండు రోజులకే తమిళనాడులోని తిరుచ్చిలో మరో స్కూటర్లో బ్యాటరీ కాలిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన ఒకినావా ప్రైస్ ప్రో మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఒకినావా రీకాల్ చేయాలని నిర్ణయించిన ఒకినావా ప్రైస్ ప్రో మోడల్ స్కూటర్లు దేశవ్యాప్తంగా 3,125 అమ్మడుడయ్యాయి. కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఒకినావా షోరూమ్‌లకు వెళ్లి వీటిని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలా తీసుకున్న స్కూటర్ల భద్రతను మరోసారి సంపూర్ణంగా పరిశీలించనుంది ఒకినావా. ఒకినావా స్కూటర్ కేంద్ర కార్యాలయం, తయారీ యూనిట్ హర్యాణాలో ఉంది. ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా ఒకినావాకి సంబంధించి మొత్తం 25,000 స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. ఇందులో హై స్పీడ్ వెహికల్ విభాగంలో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అందులో బ్యాటరీ పనితీరు, రక్షణ వ్యవస్థలను చెక్ చేయాలని ఒకినావా నిర్ణయించింది. చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..! -
మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా చమరు ధరలు పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఇటీవల జరిగిన సంఘటనల వల్ల నీలి నీడలు అలుముకున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, ఈ సంఘటనలు మరిచిపోకముందే చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. చెన్నైలో మంటలు చెలరేగుతున్న ప్యూర్ ఈవీ స్కూటర్ వీడియోను ది ఎకనామిక్ టైమ్స్'కు చెందిన సుమంత్ బెనర్జీ ట్వీట్ చేశారు. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. సుమంత్ బెనర్జీ ట్వీట్ చేసిన వీడియోలో రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు ప్యూరీ ఈవీ ద్విచక్ర వాహనంలో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు 4 రోజుల్లో 4 జరిగాయి అని సుమంత్ బెనర్జీ పేర్కొన్నారు. Another one...Its spreading like a wild #Fire . After #Ola & #okinawa #electric scooter from #PureEV catches fire in Chennai. Thats the 4th incident in 4 days.. The heat is on.#ElectricVehicles #OLAFIRE #lithiumhttps://t.co/pFJFb7uKD7 pic.twitter.com/jJqWA48CNf — Sumant Banerji (@sumantbanerji) March 29, 2022 ఇది ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన రెండు సంఘటనలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వాహన దారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే విధంగా వాటిపై భారీ రాయితీలు కూడా అందిస్తుంది. ఇలాంటి, కీలక సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడంతో ప్రజలలో ఉన్న భయాందోళనలను తగ్గించడానికి కేంద్రం ఈ రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది. పూణేలో జరిగిన సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు అంటుకోగా, తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ద్విచక్రవాహనానికి మంటలు అంటుకున్నాయి. (చదవండి: టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో టాటా కాఫీ విలీనం!) -
ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!
మహారాష్ట్ర, తమిళనాడులో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్న రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని కేంద్రం మార్చి 28న నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మీడియా పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1ప్రో బైకు అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అలాగే, తమిళనాడులోని వెల్లూర్‌లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు మరణించారు. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్ ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూటర్‌కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దుర్మైవర్మ, అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. As summer arrives, it’s a real test for survival of #EV in India. #EVonFire #BatteryMalfunction pic.twitter.com/Xxv9qS4KSu — Saharsh Damani, MBA, CFA, MS (Finance) (@saharshd) March 26, 2022 అయితే, ఇటీవల ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడంతో చాలా మంది వినియోగదారులను ఆందోళనకు గురిఅయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సాహిస్తున్న ఈ తరుణంలో ఈ మంటలు చెలరేగడంతో ఈ ఘటనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈవీలకు మంటలు అంటుకున్న కేసులను స్వతంత్ర నిపుణుల బృందం దర్యాప్తు చేయనుంది. ఈ మంటలు చెలరేగడానికి నిర్మాణాత్మక లేదా బాహ్య కారకాలు కారణమయ్యాయా అని పరిశోధించడానికి నిపుణుల బృందం వెల్లూరు, పూణేకు వెళ్లనున్నారు. ముఖ్యంగా, ఈ రెండు ద్విచక్రవాహనాలు ప్రారంభించడానికి ముందు పరీక్షించి, రోడ్డు మీద తిరగడానికి అనుమతులు జారీ చేశాయి. వాహన తయారీలో లోపం ఉన్నదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్కువ శాతం లిథియం-అయాన్ బ్యాటరీలు(ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తారు). ఈ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించినా బ్యాటరీని సరిగ్గా తయారు చేయకపోయినా లేదా దెబ్బతిన్నా, బ్యాటరీని ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ సరిగ్గా డిజైన్ చేయకపోయినా మంటలు చెలరేగవచ్చు. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతు గల ఓలా ఎలక్ట్రిక్ గత వారం ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు తెలిపింది. పూణేకు చెందిన ఒక ట్విట్టర్ యూజర్ తన ఓలా స్కూటర్ మంటల్లో కాలిపోతున్న వీడియోను షేర్ చేయడంతో ఓలా ఈ దర్యాప్తును ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా, కంపెనీ ఒక ప్రకటనలో ఇలా తెలిపింది: "మా స్కూటర్లలో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్నివిషయాలను మీతో పంచుకుంటాము" అని కంపెనీ తెలిపింది. (చదవండి: OnePlus 10 Pro: లీకైన వన్‌ప్లస్ 10 ప్రో ధర.. ఎంతో తెలుసా?) -
మార్కెట్లలోకి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్..200 కిమీపైగా రేంజ్, ధర ఎంతంటే..?
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఒకి-90(Okhi-90) హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో రానుంది. ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త Okhi 90 అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఒకి-90 స్పెసిఫికేషన్లలో అదుర్స్..! హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకి-90 అదిరిపోయే స్పెసిషికేషన్స్తో రానుంది. Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.6kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 3.8kW ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. ఇది IP-65 సర్టిఫికేట్ పొందింది. ఎకో , స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను కల్గి ఉంది. ఒకి-90 స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 160 కిమీ రేంజ్ వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీల వరకు ప్రయాణిస్తోంది. ఈ స్కూటర్లో 40 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే..! ఫీచర్ల పరంగా, Okhi-90 దాని బేస్ వేరియంట్లో ఆల్-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రానుంది. కాగా టాప్-స్పెక్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో టీఎఫ్టీ స్క్రీన్‌ను పొందుతుంది. బేస్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ టాప్ మోడల్ కంటే ఇది రూ. 4,000 - రూ. 5,000 చౌకగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నాబ్-స్టైల్ ఆటోమేటిక్ కీలెస్ స్టార్ట్, బూట్లో యూఎస్బీ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90 kmph. బ్యాటరీ జీరో నుంచి 100 శాతం నిండేందుకు 3-4 గంటల సమయం పట్టనుంది. ధర ఎంతంటే..! ఒకి-90 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.21 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ) ప్రారంభంకానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆయా రాష్ట్రాలు అందించే ఫేమ్-2 పథకం సబ్సిడీ వర్తించనుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేదా ఆఫ్‌లైన్‌లో సమీప డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్స్ కోసం రూ. 2,000 టోకెన్ అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: మెరుపు వేగంతో దూసుకెళ్లనున్న ఎలక్ట్రిక్ బైక్.. టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? -
మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకివిడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. అయితే, విడుదలకు కొద్ది వారాల ముందు ఆ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా పేరుపొందిన ఒకినావా. ఇప్పుడు ఓఖి 90 బ్రాండ్ పేరుతో మరో కొత్త ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్-స్కూటర్ పనితీరు పరంగా ఓలా ఎస్1 ప్రో, అథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1, సింపుల్ వన్, టీవీఎస్ ఐ-క్యూబ్ వంటి వాటితో పోటీ పడనుంది. ఓఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. దీని హై-స్పీడ్ గంటకు 80-90 కిలోమీటర్ల వరకు ఉండనుంది. దీనిలో బ్యాటరీ స్వైపింగ్ సదుపాయం ఉంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తో పాటు బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీని ధర రూ.1-1.20 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. (చదవండి: ఎలన్ మస్క్ కలను గల్లంతుచేసిన రష్యా ఉక్రెయిన్ వార్..!) -
ఓలాకి పోటీగా..దేశీయ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్! ధర ఎంతంటే?
ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ వెహికల్ దిగ్గజం ఒకినావా 'ఒకి90'పేరుతో మార్చి 24న కొత్త వెహికల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా పేరుపొందిన ఒకినావా ఇప్పుడు ఓకి90 బ్రాండ్ పేరుతో మరో కొత్త ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫీచర్లు, సామర్ధ్యం ఒకినావాకు చెందిన ఐప్రైస్ ప్లస్ వెహికల్ హై స్పీడ్, లాంగ్ రేంజ్ తరహాలో ఓకి 90 తొలి వెహికల్ కానుండగా..ఈ వెహికల్ రేంజ్ 160కిలోమీటర్లుగా ఉంది. ఈ వెహికల్లో బ్యాటరీ స్వైపింగ్ సదుపాయం ఉంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తో పాటు బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది ధర ఎంతంటే? ఓకినావా ఓకీ 90 వెహికల్ ఓలా ఎస్1 ప్రో,ఎథేర్ ఎనర్జీ 450ఎక్స్, బజాజ్ చేతక్ తో పాటు దేశంలో ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పోటీ పడుతుండగా దీని ధర రూ.1-1.20 లక్షల (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ కానుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఒకినావా రికార్డు..!
Okinawa Electric Scooter Sales In 2021: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు లక్ష హైస్పీడ్, లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మినట్లు పేర్కొంది. భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తున్న పాపులర్ ఐప్రైస్ +, ప్రైస్ ప్రో స్కూటర్లు ఎక్కువ అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. సంస్థ మొత్తం అమ్మకాల్లో దాదాపు వీటి వాటా 60-70% ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ భారతదేశంలో 400 ప్రాంతాలలో డీలర్ షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇందులో మెట్రో నగరాలతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఒకినావా గెలాక్సీ పేరుతో అత్యాధునిక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. అంతేగాక, రాబోయే సంవత్సరంలో భారతదేశంలో మరో 50 గెలాక్సీ స్టోర్లను ఏర్పాటు చేయలని కంపెనీ యోచిస్తోంది. ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐప్రైస్ + మోడల్ ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 139 కిలోమీటర్లు దూసుకెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి 50 కిమీ. ఈ స్కూటర్ మోటార్ మీద 3 ఏళ్ల వరకు వారెంటీ కూడా ఉంది. దీని ధర వచ్చేసి రూ.105,990లుగా ఉంది. ఈ సందర్భంగా ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు & ఎండి జితేందర్ శర్మ మాట్లాడుతూ.. "ఒకినావాపై నమ్మకాన్ని ఉంచిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాము.. మీ అందరివల్ల ఈ మైలురాయిని సాధించినట్లు" తెలిపారు. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!) -
ఓలా, సింపుల్ వన్‌కు పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్స్
Electric Vehicle: దేశీయ మార్కెట్లో ఓలా, సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అందుబాటులో ఉండగా.. ఆ వెహికల్స్ పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్ విడుదల కానుంది.పెట్రోల్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పైగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ఒకి90, ఒకి100 పేరుతో ఎలక్ట్రికల్ వెహికల్‌ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒకినోవా ఈవీ స్పెసిఫికేషన్స్ కేవలం 40 నిమిషాల్లో ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లిథియం ఆయాన్ బ్యాటరీని అమర్చనున్నట్లు ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వెహికల్లో సెంట్రల్ మౌంటెడ్ మోటార్ తో పాటు జియో ఫెన్సింగ్, నావిగేషన్, డయాగ్నోస్టిక్స్ ఫీచర్స్, ఇన్ బిల్ట్ 4జీ సిమ్‌ను కనెక్ట్ చేయనున్నారు. వాటి ధరలు వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానున్న ఒకి90 ధర రూ.1లక్ష కంటే తక్కువగా ఉంటుందని ఒకినోవా ఆటోటెక్ ఎండీ జితేందర్ శర్మ అన్నారు.కాగా, ఒకి90 ని లాంఛ్ చేయడానికి ముందే ఒకి100 ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. -
ఫుల్ ఛార్జింగ్.. 60 కిలోమీటర్ల మైలేజీ
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఒకినవా స్కూటర్స్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఒకినవా ఆర్ 30 పేరుతో స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్‌ను రూపకల్పన చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ మోడల్‌కు 250వాట్ల బీఎల్డీసీ వాటర్ ప్రూఫ్ మోటర్‌ను అమర్చారు. ఈ స్కూటర్లో 1.25 కిలోవాట్ల రిమూవల్ లిథియం–అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఇంట్లో ఉండే సాధారణ సాకెట్ల ద్వారా కూడా చార్జింగ్ చేయవచ్చు. బ్యాటరీ పూర్తిగా కావడానికి 4–5గంటలు పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ కలిగిన బ్యాటరీ 60 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ స్కూటర్ 5 రంగుల్లో లభ్యమవుతుంది. ధర ఎక్స్‌షోరూం వద్ద రూ.58,692గా ఉంది. బ్యాటరీ, మోటర్‌పై 3 ఏళ్ల వారంటీ అందిస్తుంది. (చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్) -
ఒకినావా ఆర్30 ఈ స్కూటర్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఒకినావా స్కూటర్స్ కొత్త ఇ- వాహనాన్ని లాంచ్ చేసింది. ఒకినావా ఆర్ 30 పేరుతో స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వయసుల వినియోగదారులతోపాటు ముఖ్యంగా తక్కువ వేగంగా పిల్లలకు బావుంటుందని, వారికి కొత్త ఎలక్ట్రిక్ వాహన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పిల్లలు, మహిళలు వారి రోజువారీ పనులైన షాపింగ్, ట్యూషన్లు, పాఠశాలలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని ఒకినావా పేర్కొంది. 250 వాట్ల వాటర్ రెసిస్టెంట్ మెటారు, 1.25 కిలోవాట్ల డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని జోడించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 4-5 గంటలు పడుతుంది. స్కూటర్ ఆటో కట్‌తో మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. ఈ-స్కూటర్ పెర్ల్ వైట్, సీ గ్రీన్, సన్‌రైజ్ ఎల్లో, గ్లోసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్ 5 రంగులలో లభిస్తుంది. స్టైలిష్ ఫ్రంట్ హెడ్లైట్లు, రియర్ లైట్లు, స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఇతర ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఇది రూ. 58992 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. బ్యాటరీ , మోటారు రెండింటిపై 3 సంవత్సరాల వారంటీ అందిస్తోంది. -
ఒకినామా ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కిల్ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు. భారతీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటోందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు. అలాగే ఈ వాహనాలపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించిన కారణంగా ఇది అత్యంత చౌకైన స్కూటర్ అని శర్మ తెలిపారు. ప్రైజ్‌ప్రో స్కూటర్ కీలక స్పెసిఫికేషన్స్ 1000-వాట్ల బీఎల్డీసీ వాటర్‌ప్రూఫ్ ఎలక్ట్రిక్ మోటారు ఇది 2.0 కిలోవాట్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. గరిష్ట శక్తి 2500 వాట్స్ 2 నుండి 3 గంటల్లో పూర్తి ఛార్జింగ్ స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీ / ఛార్జ్ ఎకో మోడ్‌లో 110 కిమీ / ఛార్జ్ బ్యాటరీ వారెంటీ: 3 సంవత్సరాలు లేదా 20000 కి.మీ (ఏది ముందు అయితే అది) ఫైనాన్సింగ్ పార్టనర్లు: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎకో మోడ్ 30-35 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుండగా, స్పోర్ట్స్ మోడ్‌లో 50-60 కిలోమీటర్ల వేగాన్ని, టర్బో అత్యధిక టాప్ స్పీడ్‌తో 65-70 కిలోమీటర్లు అందిస్తుంది. ఇంకా సెంట్రల్ లాకింగ్ విత్ యాంటీ-తెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ యుఎస్బీ పోర్ట్ , మోటర్ వాకింగ్ అసిస్ట్ విత్ ఫ్రంట్ అండ్ రివర్స్ మోషన్, రోడ్డుసైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ఇందులో జోడించింది. ఒకినావా ప్రైజ్ప్రోలో 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది.