
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకివిడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. అయితే, విడుదలకు కొద్ది వారాల ముందు ఆ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా పేరుపొందిన ఒకినావా. ఇప్పుడు ఓఖి 90 బ్రాండ్ పేరుతో మరో కొత్త ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్-స్కూటర్ పనితీరు పరంగా ఓలా ఎస్1 ప్రో, అథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1, సింపుల్ వన్, టీవీఎస్ ఐ-క్యూబ్ వంటి వాటితో పోటీ పడనుంది.
ఓఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ స్కూటర్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. దీని హై-స్పీడ్ గంటకు 80-90 కిలోమీటర్ల వరకు ఉండనుంది. దీనిలో బ్యాటరీ స్వైపింగ్ సదుపాయం ఉంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తో పాటు బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీని ధర రూ.1-1.20 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.
(చదవండి: ఎలన్ మస్క్ కలను గల్లంతుచేసిన రష్యా ఉక్రెయిన్ వార్..!)
Comments
Please login to add a commentAdd a comment