Electric Vehicle: దేశీయ మార్కెట్‌లో ఓలా, సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అందుబాటులో ఉండగా.. ఆ వెహికల్స్ పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్ విడుదల కానుంది.పెట్రోల్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పైగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ఒకి90, ఒకి100 పేరుతో ఎలక్ట్రికల్ వెహికల్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఒకినోవా ఈవీ స్పెసిఫికేషన్స్
కేవలం 40 నిమిషాల్లో ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లిథియం ఆయాన్ బ్యాటరీని అమర్చనున్నట్లు ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వెహికల్‌లో సెంట్రల్ మౌంటెడ్ మోటార్ తో పాటు జియో ఫెన్సింగ్, నావిగేషన్, డయాగ్నోస్టిక్స్ ఫీచర్స్, ఇన్ బిల్ట్ 4జీ సిమ్‌ను కనెక్ట్ చేయనున్నారు.
వాటి ధరలు
వచ్చే ఏడాది మార్కెట్‌లో విడుదల కానున్న ఒకి90 ధర రూ.1లక్ష కంటే తక్కువగా ఉంటుందని ఒకినోవా ఆటోటెక్ ఎండీ జితేందర్ శర్మ అన్నారు.కాగా, ఒకి90 ని లాంఛ్ చేయడానికి ముందే ఒకి100 ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment