దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. 2022లో 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా.. 2023లో అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు(3 కోట్లు) చేరుకుంటుందని అంచనా.
2023లో అమ్ముడైన మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. అందులో ఓలా కంపెనీ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2022లో 1.1 లక్షల మేరకు అమ్ముడైన ఓలా వాహనాలు 2023లో మాత్రం 140శాతం పెరిగి ఏకంగా 2.62 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. తర్వాతి స్థానంలో టీవీఎస్, ఏథర్, బజాజ్ కంపెనీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగనున్న నేపథ్యంలో ఈ సంస్థలకు భారీగా లాభాలు రాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలో వారీగా 2023లో రిజిస్టర్ అయిన విద్యుత్ వాహనాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
- ఓలా ఎలక్ట్రిక్: 2,62,020
- టీవీఎస్: 1,65,190
- ఏథర్: 1,03,804
- బజాజ్: 70,274
- యాంపెర్: 42,909
- ఒవినావా: 31,519
- హిరో ఎలక్ట్రిక్: 29,925
- హిరో: 10,967
- ప్యూర్: 7,141
- రెవోల్ట్: 6,922
- లెక్ట్రిక్స్: 6,185
- జితేంద్ర ఎలక్ట్రిక్: 2,597
Comments
Please login to add a commentAdd a comment