నోయిడా: ఎనిగ్మా ఆటోమొబైల్స్ కంపెనీ యాంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక్క చార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాటరీని వేగంగా 2–4 గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొంది.
మార్కెటింగ్‌లో పనిచేసే వారు, రెండు పట్టణాల మధ్య ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాంబియర్ ఎన్8ను తీసుకొచ్చినట్టు తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనా న్ని ఆకర్షణయమైన ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,05, 000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంది. 100 వాట్ మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీటు కింద 26లీటర్ల స్టోరేజీ స్పేస్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment