range
-
ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్లో.. ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. తక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.బ్రిస్క్ ఈవీ ఆరిజన్ ప్రో: హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ మార్చి 2023లో ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 333 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల ధర మధ్య లభించే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ.రివోట్ ఎన్ఎక్స్100: భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మరొకటి రివోట్ ఎన్ఎక్స్100. ఈ స్కూటర్ టాప్ వేరియంట్.. ఒక సింగిల్ చార్జితో 300 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 110 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1,59,000 (ఎక్స్ షోరూమ్).సింపుల్ వన్: బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. రూ. 1.54 లక్షల ధర వద్ద లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీ. ఇది కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 ప్రో జెన్ 2: దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎస్1 ప్రో జెన్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.1,47,499 ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ.ఇదీ చదవండి: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..హీరో విడా వీ1 ప్రో: సింగిల్ చార్జితో 165 కిమీ రేంజ్ అందించే హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిమీ. ఇందులో 3.94 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఆటోమొబైల్ రంగం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలక్ట్రిక్ కార్ల హవా జోరుగా సాగుతోంది. 1888లో జర్మన్ ఆండ్రియాస్ ఫ్లాకెన్ 'ఫ్లాకెన్ ఎలెక్ట్రోవాగన్' రూపొందించారు. ఆ తరువాత 1890లో ఆండ్రూ మారిసన్ మొదటి ఎలక్ట్రిక్ కారును యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేశారు. ఆ తరువాత ఈ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో కొన్ని కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఎక్కువ రేంజ్ అందించే కార్లను లాంచ్ చేశాయి.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని సింగిల్ చార్జితో ఏకంగా 1000 కిమీ రేంజ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు ఉన్నాయి. ఆ తరువాత జాబితాలో పోర్స్చే, హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు👉టెస్లా రోడ్‌స్టర్: 1000కిమీ👉విషన్ ఈక్యూఎక్స్ఎక్స్: 1000 కిమీ👉లుసిడ్ ఎయిర్: 830 కిమీ👉మెర్సిడెస్ ఈక్యూఎస్: 727 కిమీ👉కియా ఈవీ6: 708 కిమీ👉ఫోక్స్‌వ్యాగన్ ఐడీ: 703 కిమీ👉పోర్స్చే టైకాన్: 677 కిమీ👉పోలెస్టర్ 2: 653 కిమీ👉పోర్స్చే మకాన్ ఎలక్ట్రిక్: 640 కిమీ👉ఆడి క్యూ6 ఈ ట్రాన్: 637 కిమీ👉టెస్లా మోడల్ ఎస్: 634 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 5: 631👉బీవైడీ సీల్: 630 కిమీ👉టెస్లా మోడల్ 3: 627 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 6: 580 -
9 నిమిషాల ఛార్జ్.. 965 కిమీ రేంజ్: ఇది కదా కావాల్సింది
ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్ ఓ బ్యాటరీ రూపొందించింది.కొరియన్ బ్రాండ్ శాంసంగ్ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.శాంసంగ్ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
లాంగ్రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 200 కిలోమీటర్లు!
నోయిడా: ఎనిగ్మా ఆటోమొబైల్స్ కంపెనీ యాంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక్క చార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాటరీని వేగంగా 2–4 గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొంది. మార్కెటింగ్‌లో పనిచేసే వారు, రెండు పట్టణాల మధ్య ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాంబియర్ ఎన్8ను తీసుకొచ్చినట్టు తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనా న్ని ఆకర్షణయమైన ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,05, 000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంది. 100 వాట్ మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీటు కింద 26లీటర్ల స్టోరేజీ స్పేస్ కూడా ఉంది. -
భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనికి కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు.. లేదా వాతావరణ సమతుల్యతను కాపాడటం కోసం కావచ్చు. కారణం ఏదైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వినియోగం రెండూ పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు అధిక రేంజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఏవి? అవి అందించే రేంజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 (Mercedes-Benz EQS 580) ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఈక్యూఎస్ 580' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 857 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు రూ. 1.55 కోట్లు విలువైన ఈ కారు 107.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది. కియా ఈవీ6 (Kia EV6) ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ కంపెనీకి చెందిన ఈవీ6 ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 708 కిమీ పరిధిని అందిస్తుంది. రూ. 60 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 350 kW డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) 2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన ఈ కారు ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 631 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. సుమారు రూ. 45 లక్షల ధర వద్ద విడుదలైన ఈ కారు మంది డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 217 hp పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ధర పరంగా ఇది కియా ఈవీ6 కంటే తక్కువగానే ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 కూడా మన జాబితాలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. సుమారు రూ. 1.95 కోట్ల ధర కలిగిన ఈ కారు ఒక ఛార్జ్‌తో 625 కిమీ రేంజ్ అందిస్తుంది. 101.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 539 bhp పవర్ 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 239 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున వేరే వారికి డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) బివైడి ఆట్టో 3 (BYD Atto 3) భారతీయ మార్కెట్లో గత కొన్ని రోజులకు ముందు విడుదలైన 'బివైడి ఆట్టో 3' ఎలక్ట్రిక్ కారు ఒక ఛార్జ్‌తో 521 కిమీ పరిధిని అందిస్తాయి. రూ. 33.99 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 60.48 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 201 hp పవర్ 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్) భారతీయ మార్కెట్లో కేవలం ఈ కార్లు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ ఐ4, ఆడి ఈ-ట్రాన్ జిటి, ఆడి ఈ-ట్రాన్, పోర్స్చే టైకాన్, జాగ్వార్ ఐ-పేస్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
నాని రేంజ్ మారిపోయింది...
-
Ampere Zeal EX: సింగిల్ ఛార్జ్ 120 కి.మీ రేంజ్.. ధర కూడా తక్కువే!
భారతీయ మార్కెట్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 'ఆంపియర్ జీల్ ఈఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 69,900 (ఎక్స్-షోరూమ్). ఈ ధర కేవలం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్). 2023 మార్చి 31 లోపు కొనుగోలు చేసే కస్టమర్లు ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రూ.6,000 బెనిఫీట్స్ పొందవచ్చు. ఇది స్టోన్ గ్రే, ఐవరీ వైట్, ఇండిగో బ్లూ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవల్ మోడల్, కావున 2.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి 1.8kW ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ పరిధి అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎంట్రీ లెవెల్ స్కూటర్ కేవలం 5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఉంటుంది. -
ఏకంగా108 కి.మీ. రేంజ్‌తో 2023 బజాజ్ చేతక్ ఈవీ.. వచ్చేస్తోంది!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది. బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్‌పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది. భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. -
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే ముందు ఇవి తెలుసుకోండి!
దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మరి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సిద్దం అవుతున్నారు.(చదవండి: సరికొత్త మోసం.. ఇలాంటి లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే, ప్రీ-ఓన్డ్ లేదా ఉపయోగించిన వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుంది. దీని వెనుక కారణం కొత్త మోడల్స్ తో పోలిస్తే వాహనాలు సరసమైన ధరలకు వస్తాయి. అదే సమయంలో, పెద్దగా కొన్నవారికి కూడా ఎక్కువ నష్టం కలగదు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో ఈవీ ప్రీ-ఓన్డ్ వేహికల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ-ఓన్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు కొన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటరీ జీవితకాలం ఉపయోగించిన ఈవీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఇది. బ్యాటరీ మంచి కండిషన్ తో ఉన్న ఈవీలు భాగ పనిచేస్తాయి. అయితే, ఉపయోగించిన ఐసీఈ వేహికల్ కొనుగోలు చేసేటప్పుడు మీరు చెక్ చేసినట్లుగా వీటి బ్యాటరీ జీవితకాలం, రేంజ్ వంటివి చెక్ చేయాలి. ఆ తర్వాత డీల్ గురుంచి మాట్లాడండి. బ్యాటరీ జీవితకాలం ఛార్జింగ్ టైప్, ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ ఏ స్థాయికి డ్రెయిన్ చేశారు వంటి కారకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీల బ్యాటరీలు త్వరగా నష్టం వాటిల్లుతుంది. రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఎక్కువ బ్యాటరీ జీవితకాలాన్ని ఇస్తుంది. బ్యాటరీని సున్నా నుంచి చార్జ్, ఎప్పుడు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ జీవిత కాలం ప్రభావితం చెందుతుంది. ఆ లీథియం ఆయాన్ బ్యాటరీ లేదా వేరే బ్యాటరీనా అని చూసుకోవాలి. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) మైలేజ్ రేంజ్ ఈవీ రేంజ్ బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే ఈవీ అంత ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రీ-ఓన్డ్ ఈవిపై డీల్ ఖరారు చేసే ముందు బ్యాటరీ సైజు, సగటు రేంజ్ గురించి ఎల్లప్పుడూ విచారించండి. ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మౌలిక సదుపాయాల లభ్యత ఈవీ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం. నగరం, చుట్టుపక్కల ఎక్కువగా ప్రయాణించడానికి ఈవీ కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి సమస్య లేదు. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే రహదారుల వెంట ఎక్కువ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి.(చదవండి: ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!) కాలం ఒక ఎలక్ట్రిక్ వాహనం తీసుకునే ఎన్ని ఏళ్లు అయ్యింది అనేది కూడా చాలా ముఖ్యం. ఇంధన వాహనాలతో పోలిస్తే తక్కువ లైఫ్ ఉంటాయి. నిర్వహణ ఖర్చులు పెద్దగా ఉండనప్పటికి బ్యాటరీ, ఇంజిన్ సమస్య వస్తే సాదారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. వీటి జీవిత కాలం ఇంధన వాహనాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే, కొనేముందు వారు తీసుకొని ఎన్ని ఏళ్లు అయింది అనేది తెలుసుకోవాలి. -
గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఒడిషా, తెలంగాణ సహకారం తీసుకుంటాం ∙ ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ రాజమహేంద్రవరం క్రైం : ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గంజాయి రవాణా జరుగుతోందన్నారు. గంజాయి సాగు ఎక్కువగా విశాఖ జిల్లాలోని మన్యంలోను, ఒడిషా అటవీ ప్రాంతంలోను సాగవుతోందన్నారు. గంజాయి తరలింపును ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సహకారంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లోనూ, వ్యాపార కూడళ్లలో, షాపింగ్ మాల్స్, పెద్ద ఆపార్ట్మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్ట వచ్చునని తెలిపారు. కేసులు సత్వర దర్యాప్తునకు చర్యలు చేపడతామన్నారు. ఎస్పీ పనితీరు భేష్ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పని తీరు బాగుందని డీఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్ ఏర్పాటు చేశారని, అలాగే నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులకు పదేళ్ల జైలు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా రాజమహేంద్రవరం క్రైం : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ప్రాషిక్యూషన్ కథనం ప్రకారం నక్కపల్లి మండలానికి చెందిన పసగుడుగుల వెంకట రమణ, చింతపల్లి మండలానికి చెందిన వందలం కృష్ణ 2013 అక్టోబర్ 6 వ తేదీన నర్సీపట్నం వైపు నుంచి కె.ఇ. చిన్నాయి పాలెం వైపు 250 కేజీల గంజాయిని మహింద్ర వ్యాన్‌లో తలిస్తుండగా కోటనందూరు పోలీసులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. జడ్జి ఎ. రవీంద్రబాబు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒకొక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్షల రూపాయలు జరిమానా విధిస్తు కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. -
బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5
మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్ లో డేటా షేరింగ్ కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్ లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు. అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్థాన సంబంధిత సమాచారం, నావిగేషన్ వంటి కనెక్షన్ సర్వీసులకు కొత్త కార్యచరణగా ఈ వెర్షన్ ఉపయోగపడనుంది. అడ్వర్ టైజింగ్ ట్రాన్సిమిషన్ లో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్ లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్ ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్ లో జరగబోయే ఈవెంట్ లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. ఈ వెర్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ లండన్ ఈవెంట్ లోనే వెల్లడించనుంది. -
విద్యాసంస్థలన్నీ విద్యాశాఖ పరిధిలోకే..
♦ కాలేజీలు, వృత్తి విద్య, స్టడీ సర్కిళ్లన్నీ విలీనం ♦ మెడికల్, అగ్రికల్చర్, ఫార్మాకు మినహాయింపు ♦ త్వరలో తెలంగాణ నూతన విద్యా విధానం ♦ వచ్చే విద్యా సంవత్సరం నాటికి రూపకల్పన ♦ డిప్యూటీ సీఎం కడియంతో చర్చించిన సీఎం కేసీఆర్ ♦ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా మినహా మిగతా అన్ని రకాల, అన్ని స్థాయిల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత విద్యా శాఖకే అప్పగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని అంశాలను అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే నూతన విద్యా విధానం రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, సంబంధిత అధికారులతో విద్యా శాఖను ప్రక్షాళన చేసే అంశంపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రస్తుత విద్యా విధానం వల్ల విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు తప్ప ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా అవసరమయ్యే విద్యను అందించేవిధంగా రాష్ట్ర విధానం ఉండాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధాన రూపకల్పన జరగాలని చెప్పారు. ఉద్యోగమే లక్ష్యంగా విద్య విద్యార్థులకు అవసరమైన విద్యా ఉద్యోగావకాశాలు పెంచే శిక్షణ అందడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో, దేశంలో ఏయే ఉద్యోగావకాశాలున్నాయో తెలుసుకుని, వాటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ స్థాయిలో నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల గురించి మాత్రమే విద్యార్థులైనా ప్రభుత్వమైనా దృష్టి పెడుతోంది. ఈ రెండు కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న అనేక పోటీ పరీక్షలున్నాయి. రక్షణ, రైల్వే, బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలున్నా, వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందడం లేదు. వీటికి తోడు దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న రంగాలెన్నో పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు ఎంత మంది కావాలి..? ఇంజనీర్లు ఎందరు కావాలి..? ఇంకా ఏయే ఉద్యోగాలకు ఎంత మంది కావాలి..? అనే అంచనా విద్యాశాఖకు ఉండాలి. దీంతో విద్యార్థులను ఆయా ఉద్యోగాల దిశగా సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. కాగా, గతంలో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాలు మోడల్ స్కూళ్ల ప్రతిపాదనలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన మొత్తంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ శాఖల గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగా విద్యా శాఖపై దృష్టి పెట్టినపుడు వివిధ అంశాలు సీఎం దృష్టికి వచ్చాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు, స్టడీ సర్కిళ్లు.. ఇలా వేర్వేరు విద్యా సంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మైనారిటీల కోసం 60 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నిధులు విడుదల చేసి, విద్యాశాఖ నిర్వహణ, నియంత్రణలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నాయి. ఎవరికివారుగా విద్యా సంస్థలను నిర్వహించడంతో సమగ్రత లోపించింది. అందుకే వీటన్నింటినీ విద్యా శాఖ కిందికి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
క్యాపిటల్ మార్కెట్ పరిధి విస్తృతం..!
సెబీ నిబంధనలు మరింత సరళీకరణ ముంబై: క్యాపిటల్ మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొన్ని నిబంధనలు జారీ చేసింది. మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేలా కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ల లిస్టింగ్, గ్రీన్ బాండ్ల ట్రేడింగ్, లిస్టెడ్ కంపెనీల వాటాదారులు కంపెనీల నుంచి వైదొలగడం, తక్కువ లావాదేవీలతో ట్రేడవుతున్న చిన్న కంపెనీల డీలిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సరళీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లు, డిపాజిటరీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సవరించింది. ఫలితంగా పారదర్శకత, గవర్నెన్స్ పెరుగుతాయి. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు సులభంగా ప్రవేశించడానికి, నిష్ర్కమించడానికి వీలు కలుగుతుంది.