బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5 | Bluetooth 5 With Massively Improved Range, Speed Coming on Improved | Sakshi
Sakshi News home page

బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5

Published Sat, Jun 11 2016 3:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5

బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5

మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్ లో డేటా షేరింగ్ కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్ లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు. అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది.

ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్థాన సంబంధిత సమాచారం, నావిగేషన్ వంటి కనెక్షన్ సర్వీసులకు కొత్త కార్యచరణగా ఈ వెర్షన్ ఉపయోగపడనుంది. అడ్వర్ టైజింగ్ ట్రాన్సిమిషన్ లో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్ లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్ ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్ లో జరగబోయే ఈవెంట్ లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. ఈ వెర్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ లండన్ ఈవెంట్ లోనే వెల్లడించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement