ఆటోమొబైల్ రంగం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలక్ట్రిక్ కార్ల హవా జోరుగా సాగుతోంది. 1888లో జర్మన్ ఆండ్రియాస్ ఫ్లాకెన్ 'ఫ్లాకెన్ ఎలెక్ట్రోవాగన్' రూపొందించారు. ఆ తరువాత 1890లో ఆండ్రూ మారిసన్ మొదటి ఎలక్ట్రిక్ కారును యునైటెడ్ స్టేట్స్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత ఈ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో కొన్ని కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఎక్కువ రేంజ్ అందించే కార్లను లాంచ్ చేశాయి.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని సింగిల్ చార్జితో ఏకంగా 1000 కిమీ రేంజ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు ఉన్నాయి. ఆ తరువాత జాబితాలో పోర్స్చే, హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు
👉టెస్లా రోడ్‌స్టర్: 1000కిమీ
👉విషన్ ఈక్యూఎక్స్ఎక్స్: 1000 కిమీ
👉లుసిడ్ ఎయిర్: 830 కిమీ
👉మెర్సిడెస్ ఈక్యూఎస్: 727 కిమీ
👉కియా ఈవీ6: 708 కిమీ
👉ఫోక్స్‌వ్యాగన్ ఐడీ: 703 కిమీ
👉పోర్స్చే టైకాన్: 677 కిమీ
👉పోలెస్టర్ 2: 653 కిమీ
👉పోర్స్చే మకాన్ ఎలక్ట్రిక్: 640 కిమీ
👉ఆడి క్యూ6 ఈ ట్రాన్: 637 కిమీ
👉టెస్లా మోడల్ ఎస్: 634 కిమీ
👉హ్యుందాయ్ ఐయోనిక్ 5: 631
👉బీవైడీ సీల్: 630 కిమీ
👉టెస్లా మోడల్ 3: 627 కిమీ
👉హ్యుందాయ్ ఐయోనిక్ 6: 580
Comments
Please login to add a commentAdd a comment