మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయినా.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్ అందించే వాహనాలనే ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం దేశీయ విఫణిలో 15 లక్షల రూపాయలకంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3, టాటా టియాగో ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటివి ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ: భారతదేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక ఫుల్ ఛార్జీతో 325 కిమీ నుంచి 465 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ: ఇటీవల ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన విండ్సర్ ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 10.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 331 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
సిట్రోయెన్ ఈసీ3: ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఈసీ3 ధర రూ. 12.70 లక్షల నుంచి రూ. 13.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జీతో గరిష్టంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
టాటా టిగోర్ ఈవీ: టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టియాగో ఈవీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ 315 కిమీ.
టాటా పంచ్ ఈవీ: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్న టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జీతో 315 కిమీ నుంచి 421 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.
టాటా టియాగో ఈవీ: రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షల మధ్య లభించే టాటా టియాగో ఈవీ.. ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందిన సరసమైన ఎలక్ట్రిక్ కారు. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 250 కిమీ నుంచి 315 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
ఎంజీ కామెట్ ఈవీ: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. దీని ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. సింపుల్ డిజైన్ కలిగి, మూడు డోర్స్.. నలుగురు ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు 230 కిమీ రేంజ్ అందిస్తుంది.
రేంజ్ (పరిధి) అనేది ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంచుకునే బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. వాహన కొనుగోలు దారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment