భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న 'మారుతి సుజుకి' ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ టయోటాతో కలిసి 'ఈవీఎక్స్' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి ఇండియా రెండూ కలిసి మొదటి ఎలక్ట్రిక్ కారును 2025లో ఈవీఎక్స్ కారును లాంచ్ చేయనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గుజరాత్‌లోని తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనుంది.
మారుతి సుజుకి తయారీ కర్మాగారం.. గుజరాత్ హన్సల్‌పూర్‌లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ప్రస్తుతం ఇక్కడ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ వంటి మోడల్‌లు తయారవుతున్నాయి. ఈ కార్లను సంస్థ దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.
ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
మారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ నుంచి 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈవీఎక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందనున్నట్లు సమాచారం. లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment