క్యాపిటల్ మార్కెట్ పరిధి విస్తృతం..!
సెబీ నిబంధనలు మరింత సరళీకరణ
ముంబై: క్యాపిటల్ మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొన్ని నిబంధనలు జారీ చేసింది.
మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేలా కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల లిస్టింగ్, గ్రీన్ బాండ్ల ట్రేడింగ్, లిస్టెడ్ కంపెనీల వాటాదారులు కంపెనీల నుంచి వైదొలగడం, తక్కువ లావాదేవీలతో ట్రేడవుతున్న చిన్న కంపెనీల డీలిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సరళీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సవరించింది. ఫలితంగా పారదర్శకత, గవర్నెన్స్ పెరుగుతాయి. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు సులభంగా ప్రవేశించడానికి, నిష్ర్కమించడానికి వీలు కలుగుతుంది.