Capital Market
-
అదానీకి మరో షాక్, జో జాన్సన్ గుడ్‌బై, ఎవరీ జాన్సన్?
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ సాగా కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్ అదానీ సామ్రాజ్యంనుంచి తప్పుకున్నారు. లండన్‌కు చెందిన అదానీలతో సంబంధం ఉన్న ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా చేశారు. (ట్రేడర్లకు అలర్ట్: అదానీ షేర్ల పతనం, ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం) అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవీ)తో ముడిపడి ఉన్న యూకే ఆధారిత పెట్టుబడి సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌షిప్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరి 1న జో జాన్సన్ డైరెక్టర్ పదవి ఉంచి తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధృవీకరించింది. "యూకే- ఇండియా వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు" సహకరించడానికి ఎలారాలో చేరాననీ, అప్పటికి కంపెనీ మంచి పరిస్థితిలో ఉందని తనకు హామీ ఇచ్చారనీ తెలిపారు. అలాగే ఎలారా క్యాపిటల్ చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉందని అయితే ఆర్థిక నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఎక్కువ డొమైన్ నైపుణ్యం అవసరమని భావించి బోర్డుకు రాజీనామా చేసానని జో జాన్సన్ వెల్లడించారు. (అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!) ఎలారా క్యాపిటల్‌కి.. అదానీ గ్రూప్‌కి లింక్ ఏంటి? భారతీయ కార్పొరేట్ల కోసం నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థ ఎలారా క్యాపిటల్. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఎలారా క్యాపిటల్ కూడా ఒకటి. లార్డ్ జాన్సన్ గత ఏడాది జూన్‌లో లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ పిఎల్సికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎలారా క్యాపిటల్‌ను 2002లో రాజ్ భట్ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంగా స్థాపించారు, GDR (గ్లోబల్ డిపాజిటరీ రసీదు), FCCB (ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్), లండన్ AIM మార్కర్ ద్వారా భారతీయ కార్పొరేట్లకు నిధులను సమకూరుస్తుంది. ఇది న్యూయార్క్, సింగపూర్, ముంబై, అహ్మదాబాద్ లండన్లలో పూర్తి లైసెన్స్ పొందిన కార్యాలయాలను కలిగి ఉంది. ఎలారా క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం 2021 వేసవి నాటికి 5.1 శాతం వాటాతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మూడవ అతిపెద్ద వాటాదారుగా ఉంది. కాగా అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ 2022 ఏప్రిల్‌లో బోరిస్ రెండు రోజుల భారత పర్యటనలో అదానీ చైర్మన్ గౌతమ్ అదానీని అహ్మదాబాద్‌లో కలిశారు. మరోవైపు తాజా నివేదికల ఆధారంగా అదానీ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శలను మరోసారి ఎక్కు పెట్టింది. బోరిస్ జాన్సన్ 25 ఏళ్ల కుమారుడికి అహ్మదాబాద్‌లోని అదానీలతో కొంత సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని లేదా జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గురువారం డిమాండ్ చేసింది. -
జోరుమీదున్న పీనోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) పి.నోట్స్ జారీ చేస్తుంటారు. వీటి సాయంతో విదేశీ ఇన్వెస్టర్లు సెబీ వద్ద నేరుగా నమోదు కాకుండానే భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2018 మార్చిలో పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1,06,403 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. అక్టోబర్‌లో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు రూ.5,000కోట్లకు పైగా పెరగడం మొత్తం పెట్టుబడుల విలువ ఇతోధికం అయ్యేందుకు సాయపడినట్టు పీఎంఎస్ సంస్థ ‘పైపర్ సెరికా’ ఫండ్ మేనేజర్ అభయ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆసక్తికరంగా ఈక్విటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ అక్టోబర్‌లో రూ.7,000 కోట్ల మేర పెరగ్గా.. డెట్ పెట్టుబడుల విలువ రూ.2,000 కోట్ల మేర తగ్గింది. అయితే, ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక వడ్డీ రేట్లు కనిష్టాలకు చేరుకోగా, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2022లో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచక తప్పదు’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.97,751 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.97,744 కోట్లుగాను, జూలైలో రూ.85,799 కోట్ల చొప్పున ఉంది. ఎఫ్‌పీఐల నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్ చివరికి రూ.53.60 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
డీమ్యాట్ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలలో గల షేర్లను విక్రయించేటప్పుడు ఇకపై రిటైల్ ఇన్వెస్టర్లకు కొత్త వెసులుబాటు లభించనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలను వచ్చే నెల(ఆగస్ట్) 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విక్రయించిన షేర్లు వారి ఖాతాలోనే బ్లాక్(నిలుపుదల) కానున్నాయి. సేల్ ప్రక్రియ పూర్తయితేనే కొనుగోలుదారు ఖాతాలోకి బదిలీ అవుతాయి. ఒకవేళ వాటాల అమ్మకం విఫలమైతే ఖాతాలో తిరిగి అందుబాటులోకి(అన్‌బ్లాక్) రానున్నాయి. ఇప్పటివరకూ ఎర్లీ పే ఇన్(ఈపీఐ) విధానం ప్రకారం క్లయింట్లు షేర్లను విక్రయిస్తే ఖాతా నుంచి బదిలీ అవుతున్నాయి. అమ్మకం లావాదేవీ ఫెయిలైతే(ఎగ్జిక్యూట్ కాకుంటే) తిరిగి షేర్లు వెనక్కి వస్తున్నాయి. బదిలీకాకుండా తాజా నిబంధనల ప్రకారం అమ్మకం లావాదేవీని చేపట్టాక షేర్లు డీమ్యాట్ ఖాతాలో బ్లాక్ కానున్నాయి. సేల్ ప్రక్రియ పూర్తయితేనే బదిలీ అవుతాయి. లేకుంటే అదే ఖాతాలో ట్రేడింగ్ చేసేందుకు రిలీజ్ అవుతాయి. సేల్ చేసిన షేర్లు టైమ్ ప్రాతిపదికన క్లయింట్ డీమ్యాట్ ఖాతాలో బ్లాక్ కానున్నాయి. అయితే ఇది క్లయింట్లు కోరుకుంటేనే అమలుకానుంది. ఈ విధానంతోపాటు ఈపీఐ నిబంధనలు సైతం అమలుకానున్నట్లు సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది. అమ్మకం లావాదేవీ పూర్తికాని సందర్భాల్లో షేర్లు క్లియరింగ్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యాక తిరిగి వెనక్కి రావడంలో జాప్యం జరిగే సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలకు నివారణగా.. సెబీ తాజా నిబంధనలు రూపొందించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇందుకు తగిన విధంగా డిపాజిటర్లు, క్లియరింగ్ కార్పొరేషన్లు తమ వ్యవస్థలను ఆధునీకరించవలసిందిగా సెబీ ఆదేశించింది. -
ఎల్ఐసీ ఐపీఓ దిశగా మరో అడుగు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) విషయంలో మరో అడుగు ముందుకుపడింది. ఐపీఓ సంబంధిత విషయాల్లో సలహాలు ఇవ్వడానికి (ప్రి–ఐపీఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్) రెండు సంస్థలను కేంద్రం ఎంపిక చేసిందని సమాచారం. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా సంస్థల నియామకం దాదాపు ఖరారైందని సంబంధిత వర్గాలు తెలిపా యి. ఇక ఎల్ఐసీ విలును మదింపు చేయడానికి ఆక్చూరియల్ సంస్థను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించనున్నది. ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000 కోట్లు! ఎల్ఐసీ విలువ రూ. 8–10 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాను విక్రయించే అవకాశాలున్నాయని, మొత్తం మీద ఎల్ఐసీ ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నారు. నిధుల కొరత సమస్యను అధిగమించడానికి ఎల్ఐసీ ఐపీఓ నిధులను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ లాభంలో 34 శాతం వృద్ధి ముంబై: ఎల్ఐసీ అనుబంధ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం 34 శాతం పెరిగి రూ.817 కోట్లుగా నమోదైంది. కేటాయింపులు తగ్గడం కలిసొచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి సంస్థ లాభం రూ.610 కోట్లుగా ఉండడం గమనార్హం. మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.56 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.253 కోట్లుగా ఉన్నాయి. ఇక సంస్థ ఆదాయం రూ.4,807 కోట్ల నుంచి రూ.4,977 కోట్లకు వద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.1,186 కోట్ల నుంచి రూ.1,220 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (నిధుల సమీకరణపై చేసిన ఖర్చును, ఆయా నిధులను రుణాలుగా ఇవ్వడం ద్వారా ఆర్జించిన రాబడి నుంచి మినహాయించగా) 2.41 శాతం నుంచి 2.31 శాతానికి పరిమితమైంది. జూన్ చివరికి మొత్తం రుణాల్లో 25 శాతం మేర మారటోరియం పరిధిలో ఉన్నట్టు సంస్థ తెలిపింది. దీన్ని మరింత లోతుగా చూస్తే రిటైల్ గహ రుణాల్లో 16శాతమే మారటోరియం పరిధిలో ఉండగా, ప్రాపర్టీ డెవలపర్లకు ఇచ్చిన రుణాల్లో 77 శాతం మారటోరియం పరిధిలో ఉండడం గమనార్హం. రుణాల పోర్ట్ ఫోలియో రూ.2,09,817 కోట్లకు పెరిగింది. -
మునిసిపల్ బాండ్ మార్కెట్ నిబంధనల సరళీకరణ
న్యూఢిల్లీ: మునిసిపల్ బాండ్ మార్కెట్‌కు సంబంధించిన నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ సరళీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించానులనుకునే మునిసిపాలిటీలు 2013–14 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల(2013–14, 2014–15, 2015–16) ఆడిట్ చేసిన అకౌంట్లను స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించాలని సెబీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సర అకౌంట్లు సమర్పించడం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ అకౌంట్లను వచ్చే ఏడాది మార్చి 31లోపు సమర్పించాల్సి ఉంటుంది. -
ఇన్ఫోసిస్‌పై సెబీ కన్ను!
కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారిందన్న మూర్తి వ్యాఖ్యలతో రంగంలోకి... పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడి నేడు సంస్థాగత ఇన్వెస్టర్లతో సీఈఓ విశాల్ సిక్కా భేటీ న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ చిచ్చు అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. వ్యవస్థాపకులు, కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు మధ్య నెలకొన్న విభేదాలు ఇన్వెస్టర్లలో కలకలం రేపుతున్నాయి. కంపెనీలో కార్పొరేట్ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. ఇన్ఫీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ ఉదంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టాటా గ్రూప్‌తో పాటు యునైటెడ్ స్పిరిట్స్, రికో ఇండియా వంటి కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వెలుగుచూసిన తర్వాత మరో కీలక దేశీ కంపెనీలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడంతో సెబీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ‘ఇన్ఫీ పరిణామాలపై మీడియాలో వచ్చిన పలు కథనాలను పరిగణనలోకి తీసుకొని... ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి వివరణ కోరాం. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు దిగ్గజ కంపెనీల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిన్నింటిపైనా మేం నిశితంగా దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రయోజనాలనూ పరిరక్షించడం మా విధి’ అని సెబీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీని భారీగా పెంచడంతో పాటు మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్దమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్ చేయడంపై వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కార్పొరేట్ ప్రమాణాలు దిగజారాయంటూ బోర్డుకు వారు లేఖ కూడా రాసినట్లు మీడియాలో గుప్పుమంది. అలాంటి లోపాలేవీ లేవని, అవన్నీ వదంతులే నంటూ సీఈఓ సిక్కా, ఇతర బోర్డు సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, నారాయణ మూర్తి స్వయంగా కార్పొరేట్ ప్రమాణాలు గత రెండేళ్లుగా పడిపోతూవస్తున్నాయని ఇంటర్వూ్యల్లో పేర్కొనడంతో విభేదాలు నిజమేనని తేటతెల్లమైంది. బోర్డును ప్రక్షాళన చేయాలని కూడా ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుత నాయకత్వ బృందంపై వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైంది. మరోపక్క, కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇటీవలి పరిణామాలపై(భా రీగా ప్యాకేజీలు ఇవ్వడంపట్ల) ప్రశ్నలు లేవనెత్తుండటం తెలిసిందే. అవసరమైతే కంపెనీ నుంచి నేరుగా వివరణ... అత్యంత ప్రొఫెషనల్‌గా నిర్వహించే కంపెనీల జాబితాలో ఉన్న ఇలాంటి కంపెనీలు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ముందుంటాయని.. ఇప్పుడు ఇలాంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోవడం వల్ల పెట్టుబడులకు సానుకూల గమ్యంగా భారత్ సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులు దెబ్బతింటాయని సెబీ అధికారి వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణను పరిశీలిస్తామని.. అవసరమైతే కంపెనీ నుంచే నేరుగా తాము వివరణ కోరనున్నట్లు ఆయన చెప్పారు. తాము ప్రత్యక్షంగా ఈ విషయంలో జోక్యం చేసుకునే ముందు తటస్థ అడ్వయిజరీ సంస్థలతో పాటు వివిధ సంస్థాగత ఇన్వెస్టర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇన్వెస్టర్లతో సిక్కా సమావేశం నేడు... వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య విభేదాలు బట్టబయలు అయిన నేపథ్యంలో నష్టనివారణ చర్యలపై ఇన్ఫీ సీఈఓ విశాల్ సిక్కా దృష్టిసారిస్తున్నారు. నేడు ముంబైలో జరగనున్న ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన సంస్థాగత ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సమాచారం. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నిర్వహిస్తున్న ‘ఛేజింగ్ గ్రోత్ కాన్ఫరెన్స్’లో సోమవారం సిక్కా కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఫండ్ మేనేజర్లకు ఇన్ఫీలో తాజా పరిణామాలను వివరించే అవకాశం ఉంది. కాగా, ఈ సదస్సులో సిక్కా పాల్గొనడంపై చాలా రోజుల ముందే(ఇటీవల కంపెనీకి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలకు ముందే) ఖరారైందని ఇన్ఫీ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, నేడు జరిగే సమావేశంలో వ్యవస్థాపకులు, బోర్డుకు మధ్య విభేదాలే ఎక్కువగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, వ్యవస్థాపకులు లేవనెత్తిన అభ్యంతరాలపై సిక్కాతో పాటు కొందరు బోర్డు సభ్యులు సోమవారం మీడియా ముందు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇన్వెస్టర్లు నిలదీయాలి: పాయ్ ఇన్ఫోసిస్ వద్దనున్న భారీ నగదు నిల్వల సద్వినియోగం, కార్పొరేట్ ప్రమాణాల్లో లోపాలకు సంబంధించి సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రశ్నించాలని కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ‘కంపెనీలో నిధుల కేటాయింపులు చాలా ముఖ్యం. పెట్టుబడులను పరిరక్షించుకోవడం కోసం సంస్థాగత ఇన్వెస్టర్లు తప్పకుండా దీన్ని ప్రశ్నించాలి. అది వాళ్ల విధి. మరోపక్క, కార్పొరేట్ ప్రమాణాలు దిగజారడంపైనా నిలదీయాలి. ఎందుకంటే ఇది కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది’ అని పాయ్ పేర్కొన్నారు. 2016 డిసెంబర్ చివరినాటికి ఇన్ఫీ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాలంటూ పాయ్ ఎప్పటినుంచో సూచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇన్ఫీలో 13 శాతం మేర వాటా ఉన్న వ్యవస్థాపకులు ఇతర ఇన్వెస్టర్ల మాదిరిగానే బోర్డును ప్రశ్నించారని.. ఆ అధికారం వారికుందని పాయ్ వ్యాఖ్యానించారు. వారు లేవనెత్తిన అభ్యంతరాలపై బోర్డు సవివరంగా వివరణ ఇవ్వాలని చెప్పారు. -
గణాంకాలే కీలకం...
దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ వెలువడే వివిధ గణాంకాల తీరును బట్టి ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు తదితర అంశాల ప్రభావం కూడా ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. స్వల్ప రికవరీ... ఇంధన ధరల సవరణ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులో ఉంటాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. డిసెంబర్ నెల వాహన విక్రయాలను వెల్లడించనున్న నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని వారంటున్నారు. సెలవుల కారణంగా ఎఫ్ఐఐల లావాదేవీలు తక్కువ స్థాయిలో ఉంటాయని, దాంతో మార్కెట్ స్తబ్దుగానే ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం అమెరికా, కొన్ని ఇతర ప్రపంచ మార్కెట్లు పనిచేయవు. నగదు కొరత ఈ వారం కొంత తీరుతుందని, దీంతో స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక రికవరీ సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో నెలా వెనక్కే.. విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి 400 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఇలా పెట్టుబడులను ఉపసంహరించడం ఇది వరుసగా మూడో నెల. విదేశీ ఇన్వెస్టర్లు అధికంగా డెట్ మార్కెట్‌నుంచి తమ నిధులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.8,176 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.18,935 కోట్ల చొప్పున మొత్తం రూ.27,111 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఇక గత ఏడాది పరంగా చూస్తే, విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.20,566 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.43,645 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కీలక గణాంకాలు జనవరి 2 యూరోజోన్ తయారీ రంగం జనవరి 3 అమెరికా, చైనా తయారీ రంగం జనవరి 4 యూరోజోన్ కాంపొజిట్, అమెరికా ఫెడ్ మినట్స్, అమెరికా ప్రైవేట్ రంగ ఉద్యోగ వివరాలు జనవరి 5 అమెరికా, చైనా సేవల రంగం జనవరి 6 అమెరికా ఉద్యోగ గణాంకాలు -
క్యాపిటల్ మార్కెట్ పరిధి విస్తృతం..!
సెబీ నిబంధనలు మరింత సరళీకరణ ముంబై: క్యాపిటల్ మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొన్ని నిబంధనలు జారీ చేసింది. మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేలా కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ల లిస్టింగ్, గ్రీన్ బాండ్ల ట్రేడింగ్, లిస్టెడ్ కంపెనీల వాటాదారులు కంపెనీల నుంచి వైదొలగడం, తక్కువ లావాదేవీలతో ట్రేడవుతున్న చిన్న కంపెనీల డీలిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సరళీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లు, డిపాజిటరీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ సవరించింది. ఫలితంగా పారదర్శకత, గవర్నెన్స్ పెరుగుతాయి. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు సులభంగా ప్రవేశించడానికి, నిష్ర్కమించడానికి వీలు కలుగుతుంది. -
భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తాం
బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ బ్రియాన్ న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీఓఎఫ్ఏ) భారత్‌లో తన బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించనున్నది. భారత్‌లో అధిక వృద్ధికి అవకాశాలున్నాయని, అందుకే ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించనున్నామని బీఓఎఫ్ఏ చైర్మన్, సీఈఓ బ్రియాన్ మోయినిహాన్ చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లో మరింతగా విస్తరిస్తామని, మౌలిక, ఇంధన రంగాల పెట్టుబడులపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారమిక్కడ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. భారత వేగంగా వృద్ధి సాధించగలదని అంచనా వేశానని బ్రియాన్ చెప్పారు. భారత్ పట్ల ప్రపంచ దృక్పథం మారిందని వివరించారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కత, చెన్నై, బెంగళూరుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.