భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తాం | Chairman and CEO, Bank of America calls on PM | Sakshi
Sakshi News home page

భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తాం

Published Thu, Dec 4 2014 1:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తాం - Sakshi

భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తాం

బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ బ్రియాన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీఓఎఫ్‌ఏ) భారత్‌లో తన బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించనున్నది. భారత్‌లో అధిక వృద్ధికి అవకాశాలున్నాయని, అందుకే ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించనున్నామని బీఓఎఫ్‌ఏ చైర్మన్, సీఈఓ బ్రియాన్ మోయినిహాన్ చెప్పారు. క్యాపిటల్ మార్కెట్‌లో మరింతగా విస్తరిస్తామని, మౌలిక, ఇంధన రంగాల పెట్టుబడులపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారమిక్కడ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. భారత వేగంగా వృద్ధి సాధించగలదని అంచనా వేశానని బ్రియాన్ చెప్పారు. భారత్ పట్ల ప్రపంచ దృక్పథం మారిందని వివరించారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కత, చెన్నై, బెంగళూరుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement