భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్లో.. ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. తక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
బ్రిస్క్ ఈవీ ఆరిజన్ ప్రో: హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ మార్చి 2023లో ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 333 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల ధర మధ్య లభించే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ.
రివోట్ ఎన్ఎక్స్100: భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మరొకటి రివోట్ ఎన్ఎక్స్100. ఈ స్కూటర్ టాప్ వేరియంట్.. ఒక సింగిల్ చార్జితో 300 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 110 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1,59,000 (ఎక్స్ షోరూమ్).
సింపుల్ వన్: బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. రూ. 1.54 లక్షల ధర వద్ద లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీ. ఇది కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఓలా ఎస్1 ప్రో జెన్ 2: దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎస్1 ప్రో జెన్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.1,47,499 ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ.
ఇదీ చదవండి: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‍లో అత్యుత్తమ కార్లు ఇవే..
హీరో విడా వీ1 ప్రో: సింగిల్ చార్జితో 165 కిమీ రేంజ్ అందించే హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిమీ. ఇందులో 3.94 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment