ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్ ఓ బ్యాటరీ రూపొందించింది.
కొరియన్ బ్రాండ్ శాంసంగ్ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.
శాంసంగ్ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.
దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment