ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన రంగం వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా కంపెనీ 'నియో' (Nio).. అద్భుతమైన రేంజ్ (సింగిల్ ఛార్జ్ 1000 కిమీ) అందించడానికి అనుగుణంగా ఉండే ఓ బ్యాటరీని తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మార్కెట్లో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగానే చాలా సంస్థలు తమ ఉత్పత్తులను ఈవీలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు చైనా కంపెనీ పరిచయం చేసిన బ్యాటరీ టెస్లాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ బ్యాటరీతో తయారైన నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అధికారులు సుమారు 1000 కిమీ దూరం ప్రయాణించి దానికి సంబంధించిన జర్నీ లైవ్ స్ట్రీమ్ 2023 డిసెంబర్ 17న షాంఘైలో ప్రదర్శించినట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ అని కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా..
2024 ఏప్రిల్ నాటికి ఈ బ్యాటరీల ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. సంస్థ తయారు చేసే ఈ బ్యాటరీ విలువ సుమారు 42100 డాలర్ల (రూ.32 లక్షలు) వరకు ఉంటుందని సమాచారం. నిజానికి ఈ ధరతో ఓకే లగ్జరీ కారునే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ బ్యాటరీ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment