దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది.
కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది.
బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్‌పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment