
భారతీయ మార్కెట్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 'ఆంపియర్ జీల్ ఈఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 69,900 (ఎక్స్-షోరూమ్). ఈ ధర కేవలం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్).
2023 మార్చి 31 లోపు కొనుగోలు చేసే కస్టమర్లు ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రూ.6,000 బెనిఫీట్స్ పొందవచ్చు. ఇది స్టోన్ గ్రే, ఐవరీ వైట్, ఇండిగో బ్లూ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.
ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవల్ మోడల్, కావున 2.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి 1.8kW ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ పరిధి అందిస్తుంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎంట్రీ లెవెల్ స్కూటర్ కేవలం 5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment