
Okinawa Electric Scooter Sales In 2021: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు లక్ష హైస్పీడ్, లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మినట్లు పేర్కొంది. భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తున్న పాపులర్ ఐప్రైస్ +, ప్రైస్ ప్రో స్కూటర్లు ఎక్కువ అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. సంస్థ మొత్తం అమ్మకాల్లో దాదాపు వీటి వాటా 60-70% ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ భారతదేశంలో 400 ప్రాంతాలలో డీలర్ షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇందులో మెట్రో నగరాలతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఒకినావా గెలాక్సీ పేరుతో అత్యాధునిక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. అంతేగాక, రాబోయే సంవత్సరంలో భారతదేశంలో మరో 50 గెలాక్సీ స్టోర్లను ఏర్పాటు చేయలని కంపెనీ యోచిస్తోంది. ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐప్రైస్ + మోడల్ ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 139 కిలోమీటర్లు దూసుకెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి 50 కిమీ. ఈ స్కూటర్ మోటార్ మీద 3 ఏళ్ల వరకు వారెంటీ కూడా ఉంది. దీని ధర వచ్చేసి రూ.105,990లుగా ఉంది. ఈ సందర్భంగా ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు & ఎండి జితేందర్ శర్మ మాట్లాడుతూ.. "ఒకినావాపై నమ్మకాన్ని ఉంచిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాము.. మీ అందరివల్ల ఈ మైలురాయిని సాధించినట్లు" తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment