సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఒకినావా స్కూటర్స్ కొత్త ఇ- వాహనాన్ని లాంచ్ చేసింది. ఒకినావా ఆర్ 30 పేరుతో స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వయసుల వినియోగదారులతోపాటు ముఖ్యంగా తక్కువ వేగంగా పిల్లలకు బావుంటుందని, వారికి కొత్త ఎలక్ట్రిక్ వాహన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పిల్లలు, మహిళలు వారి రోజువారీ పనులైన షాపింగ్, ట్యూషన్లు, పాఠశాలలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని ఒకినావా పేర్కొంది.
250 వాట్ల వాటర్ రెసిస్టెంట్ మెటారు, 1.25 కిలోవాట్ల డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని జోడించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 4-5 గంటలు పడుతుంది. స్కూటర్ ఆటో కట్‌తో మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. ఈ-స్కూటర్ పెర్ల్ వైట్, సీ గ్రీన్, సన్‌రైజ్ ఎల్లో, గ్లోసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్ 5 రంగులలో లభిస్తుంది. స్టైలిష్ ఫ్రంట్ హెడ్లైట్లు, రియర్ లైట్లు, స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఇతర ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఇది రూ. 58992 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. బ్యాటరీ , మోటారు రెండింటిపై 3 సంవత్సరాల వారంటీ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment