సాక్షి, ముంబై: గ్రీవ్స్ కాటన్ కు చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సరికొత్త ఇ-స్కూటర్ లాంచ్ చేసింది. రూ .73,990 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద మాగ్నస్ ప్రో పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లో లభిస్తుందనీ, త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త ఇ-స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
యాంటీ-తెఫ్ట్ అలారం, డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, బ్రైట్ ఎల్‌ఇడి లైట్లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు (పగటిపూట రన్నింగ్ లాంప్స్), టెలిస్కోపిక్ సస్పెన్షన్, 450 ఎంఎం లెగ్ స్పేస్, భారీ స్టోరేజ్ బూట్ స్పేస్ , ఛార్జీకి సగటున 75-80 కిలోమీటర్ల మైలేజీలాంటి మెయిన్ ఫీచర్లను ఇందులో జోడించింది.
హై-స్పీడ్ ఇ-స్కూటర్ విభాగంలో మాగ్నస్ ప్రో సౌకర్యవంతమైన, భద్రతా లక్షణాలతో సౌలభ్యంగా లిష్ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని ఆంపియర్ ఎలక్ట్రిక్ సీవోవో సంజీవ్ చెప్పారు. కోవిడ్-19 తరువాత వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త మాగ్నస్ ఇ-స్కూటర్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ సీఎండీ నాగేష్ బసవన హళ్లి వ్యాఖ్యానించారు.
The new Magnus Pro has arrived! The electric scooter that will redefine the way you rode the conventional scooter.
— Ampere Electric Vehicles (@ampere_ev) June 15, 2020
Book yours today at Rs. 2999* and live magnified: https://t.co/WUWwrizy6n #AmpereElectric #AmpUpYourLife #GoElectric #EVRevolution #launch #productlaunch pic.twitter.com/Vgc0JaRnpx
Comments
Please login to add a commentAdd a comment