మార్కెట్లలోకి మరో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..200 కిమీపైగా రేంజ్‌, ధర ఎంతంటే..? | Okinawa Okhi-90 Electric Scooter Launched in India | Sakshi
Sakshi News home page

మార్కెట్లలోకి మరో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..200 కిమీపైగా రేంజ్‌, ధర ఎంతంటే..?

Published Fri, Mar 25 2022 8:33 AM | Last Updated on Fri, Mar 25 2022 8:58 AM

Okinawa Okhi-90 Electric Scooter Launched in India - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా  మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఒకి-90(Okhi-90) హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌తో రానుంది.  ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త Okhi 90  అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 

ఒకి-90 స్పెసిఫికేషన్లలో అదుర్స్‌..!
హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఒకి-90 అదిరిపోయే స్పెసిషికేషన్స్‌తో రానుంది. Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.6kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 3.8kW ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. ఇది IP-65 సర్టిఫికేట్ పొందింది. ఎకో , స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను కల్గి ఉంది. ఒకి-90 స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 160 కిమీ రేంజ్‌ వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిమీల వరకు ప్రయాణిస్తోంది. ఈ స్కూటర్‌లో 40 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

 

ఫీచర్స్‌ విషయానికి వస్తే..!
ఫీచర్ల పరంగా, Okhi-90 దాని బేస్ వేరియంట్‌లో ఆల్-డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రానుంది. కాగా టాప్-స్పెక్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో టీఎఫ్‌టీ  స్క్రీన్‌ను పొందుతుంది. బేస్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ టాప్ మోడల్ కంటే ఇది రూ. 4,000 - రూ. 5,000 చౌకగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో నాబ్-స్టైల్ ఆటోమేటిక్ కీలెస్ స్టార్ట్, బూట్‌లో యూఎస్‌బీ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90 kmph. బ్యాటరీ జీరో నుంచి 100 శాతం నిండేందుకు 3-4 గంటల సమయం పట్టనుంది.

ధర ఎంతంటే..!
ఒకి-90 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 1.21 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ) ప్రారంభంకానుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై ఆయా రాష్ట్రాలు అందించే ఫేమ్‌-2 పథకం సబ్సిడీ వర్తించనుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సమీప డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా ప్రీ-బుకింగ్స్‌ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్స్‌ కోసం రూ. 2,000 టోకెన్ అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. 

చదవండి: మెరుపు వేగంతో దూసుకెళ్లనున్న ఎలక్ట్రిక్ బైక్.. టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement