ఫుల్‌ ఛార్జింగ్‌.. 60 కిలోమీటర్ల మైలేజీ | Okinawa R30 Electric Scooter Launched In India | Sakshi
Sakshi News home page

ఒకినవా ఆర్‌30 ఆవిష్కరణ

Published Wed, Sep 2 2020 11:15 AM | Last Updated on Wed, Sep 2 2020 11:15 AM

Okinawa R30 Electric Scooter Launched In India - Sakshi

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఒకినవా స్కూటర్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఆవిష్కరించింది. ఒకినవా ఆర్‌ 30 పేరుతో స్లో స్పీడ్‌ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్‌ను రూపకల్పన చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ మోడల్‌కు 250వాట్ల బీఎల్‌డీసీ వాటర్‌ ప్రూఫ్‌ మోటర్‌ను అమర్చారు.

ఈ స్కూటర్‌లో 1.25 కిలోవాట్ల రిమూవల్‌ లిథియం–అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఇంట్లో ఉండే సాధారణ సాకెట్ల ద్వారా కూడా చార్జింగ్‌ చేయవచ్చు. బ్యాటరీ పూర్తిగా కావడానికి 4–5గంటలు పడుతుంది. ఫుల్‌ ఛార్జింగ్‌ కలిగిన బ్యాటరీ 60 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ స్కూటర్‌ 5 రంగుల్లో లభ్యమవుతుంది. ధర ఎక్స్‌షోరూం వద్ద రూ.58,692గా ఉంది. బ్యాటరీ, మోటర్‌పై 3 ఏళ్ల వారంటీ అందిస్తుంది. (చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్‌టెల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement