ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ వెహికల్ దిగ్గజం ఒకినావా 'ఒకి90'పేరుతో మార్చి 24న కొత్త వెహికల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా పేరుపొందిన ఒకినావా ఇప్పుడు ఓకి90 బ్రాండ్ పేరుతో మరో కొత్త ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఫీచర్లు, సామర్ధ్యం
ఒకినావాకు చెందిన ఐప్రైస్ ప్లస్ వెహికల్ హై స్పీడ్, లాంగ్ రేంజ్ తరహాలో ఓకి 90 తొలి వెహికల్ కానుండగా..ఈ వెహికల్ రేంజ్ 160కిలోమీటర్లుగా ఉంది. ఈ వెహికల్లో బ్యాటరీ స్వైపింగ్ సదుపాయం ఉంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తో పాటు బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది
ధర ఎంతంటే?
ఓకినావా ఓకీ 90 వెహికల్ ఓలా ఎస్1 ప్రో,ఎథేర్ ఎనర్జీ 450ఎక్స్, బజాజ్ చేతక్ తో పాటు దేశంలో ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పోటీ పడుతుండగా దీని ధర రూ.1-1.20 లక్షల (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment