Tata Motors: ఎక్కువమంది ప్రజలకు నమ్మికైన భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఇప్పటికే అనేక ఆధునిక ఉత్పత్తులు ప్రవేశపెట్టి తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ టాటా పంచ్ మైక్రో SUV ఉత్పత్తిలో కొత్త రికార్డ్ సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా పంచ్ న్యూ రికార్డ్..
మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి సేఫ్టీలో కూడా అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధించింది. ఈ కారణంగానే ఈ కారు అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారు ఉత్పత్తిలో 'రెండు లక్షల' యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వారియర్ అవుతోంది.
2021 అక్టోబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన టాటా పంచ్ కేవలం 20 నెలల కాలంలో ఉత్పత్తిలో ఏకంగా 2,00,000 మైలురాయిని చేరుకుంది. ఇందులో కంపెనీ 2023 మార్చి వరకు 1,86,535 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 10,930 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి ఇప్పుడు ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది.
టాటా పంచ్ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ALFA) ఆర్కిటెక్చర్ మీద రూపొందించారు. కావున ఇది అద్భుతమైన డిజైన్ అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ఆటోమాటిక్ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్, LED DRL, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, రియర్ వ్యూ కెమరా, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మోంటెడ్ కంట్రోల్స్, USB ఛార్జింగ్ సాకేట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఇది 5 స్టార్ రేటింగ్ పొంది దేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.
(ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!)
టాటా పంచ్ సిఎన్‌జి (Tata Punch CNG)
ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇది మార్కెట్లో విడుదలైతే టాటా సిఎన్‌జి విభాగంలో నాల్గవ మోడల్ అవుతుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ కలిగి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సిఎన్‌జి ట్యాంకుల కోసం కంపెనీ కొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!)
టాటా పంచ్ ఎలక్ట్రిక్ (Tata Punch EV)
ఇక టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలకావడానికి కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల వెలువడ్డాయి. ఇది కూడా మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. టాటా పంచ్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment