ముంబై : ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో పాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్టస్థాయికి చేరింది. ఐటీ, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. వేదాంత, టాటా స్టీల్ సహా పలు షేర్లు భారీగా లాభపడుతుండగా యస్ బ్యాంక్ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనయింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 40,315 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 54 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment