ఫేస్ బుక్ మరో కొత్త మైలురాయి
ఫేస్ బుక్ మరో కొత్త మైలురాయి
Published Wed, Jun 28 2017 10:28 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. నెలకు తమ కంపెనీకి యాక్టివ్ యూజర్లు 200 కోట్లకు పైగా ఉన్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. 100 కోట్ల మార్కును తాకిని తర్వాత ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఫేస్ బుక్ ఈ స్థాయిని చేధించినట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. ''మీతో కలిసి ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది'' అని ఫేస్ బుక్ సహవ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్కు జుకర్ బర్గ్ తెలిపారు. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని కంపెనీ తెలిపింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది. మార్చి 31 వరకు ఫేస్ బుక్ రు 1.94 బిలియన్ యూజర్లున్నారు. గతేడాది కంటే ఇది 17 శాతం ఎక్కువ.
2012లో అక్టోబర్ లో తొలిసారి ఫేస్ బుక్ 100 కోట్ల మైలురాయిని చేధించింది. ప్రస్తుతం మరో కొత్త మైలురాయి 200 కోట్లను ఫేస్ బుక్ అధిగమించేసింది. ప్రతిరోజు 175 మిలియన్ కు పైగా యూజర్లు లవ్ రియాక్షన్లను షేర్ చేసుకుంటున్నారని ఫేస్ బుక్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. కాగ, గత 30 రోజుల కాలంలో వెబ్ సైట్ లేదా మొబైల్ డివైజ్ లలో తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను సందర్శించే రిజిస్ట్రర్ యూజర్ల బట్టి నెలవారీ యాక్టివ్ యూజర్లను లెక్కిస్తారు. అయితే ఫేస్ బుక్ కంపెనీ వృద్ధి ఎక్కువగా అమెరికా వెలుపల దేశాల్లోనే ఉన్నట్టు తెలిసింది. ఫేస్ బుక్ కు చెందిన యూజర్లు ఇన్ స్టాగ్రామ్ కు ఏప్రిల్ నెలలో 700 మిలియన్ మంది యూజర్లున్నారు.
Advertisement