హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి | 'Fast And Furious' Paul Walker killed in car crash | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి

Published Sun, Dec 1 2013 2:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి

హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలోఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలీప్పిన్స్ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఓ కారు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో అతని స్నేహితునితో కలిసి పోర్చ్ జీటీ కారులో వెళుతుండగా  ఈ ప్రమాదం జరిగిందని వాకర్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వాకర్ కారు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఒక చెట్టుని కొన్నదన్నారు. ఆ తరువాత కారు లో చెలరేగిన మంటల్లో పాకర్ తో పాటు, అతని స్నేహితుడు కూడా మృతి చెందారన్నారు.

 

అకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామణానికి హాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైయ్యింది. 'వార్సిటీ బ్లూస్','ద ఫాస్ట్ అండ్ ఫూరియాస్' చిత్రాల ద్వారా  మంచి గుర్తింపు తెచ్చుకున్న వాకర్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. గత పద్నాలుగు సంవత్సరాల నుంచి తమ స్టూడియో ప్రతినిధులతో పాకర్ ఎంతో నమ్మకశక్యంగా ఉండే వాడని యూనివర్శల్ స్టూడియో పేర్కొంది. ఇతడు నటించిన ‘ హవర్స్’ సినిమా ఈ డిసెంబర్ నెల లో విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement