ఇక నటనకు గుడ్ బై! | Angelina Jolie looking to focus on direction | Sakshi
Sakshi News home page

ఇక నటనకు గుడ్ బై!

Published Mon, Nov 24 2014 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

ఇక నటనకు గుడ్ బై!

ఇక నటనకు గుడ్ బై!

లాస్ ఏంజిల్స్:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందా?అంటే ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి అవుననక తప్పదు. తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. అయితే తాను దర్శకురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని హొయలు ఒలగబోస్తోంది. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి  పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా'  అని ఏంజిలీనా స్పష్టం చేసింది.

చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్'  చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement