ఏంజెలీనాకు బ్రాడ్‌పిట్ ఝలక్!
లాస్ ఎంజెల్స్: తన నుంచి వేరు పడిన మాజీ భార్య, ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలికి ఆస్కార్ నటుడు బ్రాడ్‌ఫిట్ ఝలక్ ఇచ్చారు. తనకు పిల్లల భారం పట్టదని తెగేసి చెప్పారు. ఈ మేరకు పిల్లల పేరిట జమచేయాల్సిన లక్ష డాలర్లను చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని యాషెస్ షోబిజ్ అనే వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల జోలి, బ్రాడ్‌పిట్‌ల వివాహం విచ్ఛిన్నం విషయం తెలిసిందే. మరో 90 రోజుల్లో వారు పూర్తిస్థాయిలో అధికారికంగా విడిపోనున్నారు.
వీరిద్దరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే వారి పోషణార్థం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి పేరిట ట్రస్ట్ ఫండ్‌గా 2,50,000 డాలర్లను ఇరువురు వేయాల్సి ఉంటుంది. ఐదు మిలియన్ డాలర్లు వారి పోషణార్థం జమ చేయాలి. అయితే, ఈ మొత్తంలో తాను లక్ష డాలర్లను చెల్లించలేనని బ్రాడ్‌పిట్ చెప్పేశారంట. అంతేకాదు, బ్రాడ్ పిట్ నుంచి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం ఆమె చాలా గట్టిగానే వ్యవహరిస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.