భర్త ఆయుష్సు పై బెంగపెట్టుకున్ననటి కేట్ బ్లాంచెట్ | Actress Cate Blanchett feared about husband's life | Sakshi
Sakshi News home page

భర్త ఆయుష్సు పై బెంగపెట్టుకున్ననటి కేట్ బ్లాంచెట్

Published Mon, Dec 2 2013 3:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

Actress Cate Blanchett feared about husband's life

లాస్ ఏంజిల్స్:ఆస్ట్రేలియాకు చెందిన నటి కేట్ బ్లాంచెట్ను తెలియని భయం వెంటాడుతోంది. తన భర్త అండ్రూ ఆప్టన్కు నలభై సంవత్సరాల వయసు దాటడంతో బ్లాంచెట్ మదిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ ఆ భయం పట్టుకోవడానికి ఆమె తండ్రి మరణమే. కేట్ తండ్రి 40 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మరణించడమే దీనికి ప్రధాన కారణం.   తన భర్తకు నలభై ఏళ్లు నిండిపోవడంతో.. గతంలో  తండ్రి విషయంలో సంభవించిన ఆపద ఎక్కడ పునరావృతం అవుతుందోనని కేట్ తెగ భయపడిపోతున్నారు. ఈ విషయంలో కేట్ చాలా ఎక్కువగా ఆందోళనకు గురౌతున్నట్టు కాంటాక్ట్ మ్యూజిక్.కామ్ పోస్ట్ చేసింది.

 

శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ఎలిజిబెత్ చిత్రంతో కేట్ అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది.  కేట్ నటిగానే కాక, నాటక దర్శకురాలుగా వివిధ పురస్కారాలను అందుకుంది. 1995 నుండి 2010 వరకూ ఐదు అకాడమిక్ అవార్డులకు ఎంపికైంది. మూఢ నమ్మకాల సామాన్యులకే పరిమితం కాదనేది..ఈ ఉదంతాన్ని బట్టి అర్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement