'పాల్ వాకర్ మృతితో తెలివైన నటున్ని కోల్పోయాం' | Bollywood mourns Paul Walker death, says gone too soon | Sakshi
Sakshi News home page

'పాల్ వాకర్ మృతితో తెలివైన నటున్ని కోల్పోయాం'

Published Sun, Dec 1 2013 9:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'పాల్ వాకర్ మృతితో తెలివైన నటున్ని కోల్పోయాం' - Sakshi

'పాల్ వాకర్ మృతితో తెలివైన నటున్ని కోల్పోయాం'

హాలీవుడ్ నటుడు, 'ఫాస్ట్ అండ్ ఫూరియాస్' స్టార్ పాల్ వాకర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తను నమ్మలేకపోతున్నామని ట్విటర్లో పేర్కొన్నారు. పాల్ వాకర్ చనిపోయాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు.

'పాల్ వాకర్ మరణవార్తను నమ్మలేకున్నా. ఈ వార్త న్నెంతో కలచివేసింది జీవితం చాలా విచిత్రమైనది' అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ చనిపోయాడన్న వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యానని ప్రీతి జింతా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. తెలివైన, అందమైన నటున్ని కోల్పోయామని మిఖా సింగ్ వ్యాఖ్యానించారు. పాల్ వాకర్ తనకెంతో ఇష్టమని జాకీ భగ్నానీ వెల్లడించారు.

పాల్ వాకర్ ఆత్మకు శాంతి కలగాలని సోనాల్ చౌహాన్, అఫ్తాబ్ శివసాని, దియా మిర్జా, సోఫీ చౌదరి, బిజోయ్ నంబియార్ తదిరులు కోరుకున్నారు. కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement