లాలూ తనయుడి బాలీవుడ్‌ ఎంట్రీ! | Lalu Son Tej Pratap Yadav Bollywood Debut | Sakshi
Sakshi News home page

లాలూ తనయుడి బాలీవుడ్‌ ఎంట్రీ!

Published Wed, Jun 27 2018 5:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Lalu Son Tej Pratap Yadav Bollywood Debut - Sakshi

పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను తేజ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘రుద్ర’  ది అవతార్‌ పేరుతో ఉన్న పోస్టర్‌ను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో హిందీ ఫిల్మ్‌.. కమింగ్‌ సూన్‌ అంటూ పేర్కొన్నారు. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తేజ్‌ ఈ నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచారు. గతంలో కూడా తేజ్‌ ఓ భోజ్‌పురి చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ వైరల్‌గా మారింది. లాలూ  అభిమానులు ఇప్పుడే సినిమా సూపర్‌ హిట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

గత నెలలో ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్‌ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత తేజ్‌ ఎక్కువగా అధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల లాలూ తనయుల మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరగగా లాలూ చిన్నకుమారుడు తేజస్వీ యాదవ్‌ వాటిని ఖండించారు. కాగా కొద్ది కాలంగా ఆర్జేడీలో కీలకంగా వ్యవహరిస్తున్న తేజస్వీనే రాజకీయాల్లో లాలూకు వారసుడంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement