
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.
కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
పోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment