
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. ‘కయన్ కూపే’ మోడల్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదలచేసింది. కేవలం 6 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ మోడల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో కయన్ కూపే ధర రూ. 1.32 కోట్లు కాగా, కయన్ టర్బో కూపే ధర రూ. 1.98 కోట్లు. ఈ నూతన మోడల్‌లో మూడు లీటర్ల వీ6 టర్బో ఇంజిన్ అమర్చగా, అవుట్‌పుట్ 340 హెచ్‌పీగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగలిన సీట్లు, 7–అంగుళాల డిస్‌ప్లే, 12.3–అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్, 22 ఇంచ్ జీటీ డిజైన్ వీల్స్ నూతన మోడల్లో స్పెసిఫికేషన్లుగా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment