Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు.
ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్‌ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది.
క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్‌స్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్‌ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు.
అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్‌లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్‌ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్‌కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్‌స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్‌స్టర్‌తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్‌స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్‌స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్‌స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్‌లలో లభిస్తుంది.
పోర్షే 718 బాక్స్‌స్టర్ కన్వర్టిబుల్ రూఫ్‌టాప్‌తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్‌ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు.
Comments
Please login to add a commentAdd a comment