
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మన్‌కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్‌కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్‌కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..
Comments
Please login to add a commentAdd a comment