టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌కార్‌తో ఉన్న నాగ చైతన్య ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్‌కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నేచురల్ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్‌తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్‌పీ పవర్‌ను, 468 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.
నాగ చైతన్యకు ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్‌లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర కార్లు ఉన్నాయి.
వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య రాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment