
Ram Kapoor owns Porsche 911 Turbo S (992): ప్రముఖ టెలివిజన్ నటుడు రామ్ కపూర్, "బడే అచ్చే లాగ్తే హై" 'కసమ్ సే' లాంటి పాపులర్ టీవీ సీరియళ్లతోపాటు అనేక బాలీవుడ్ సినిమాలలో నటనతో తనకంటూ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్‌కు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ముఖ్యంగా పోర్షే కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల తన గ్యారేజ్‌లో మూడో కారును జోడించాడు. టాప్ వేరియంట్ స్పోర్ట్స్ కారు 992 టర్బో S కారును కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ. 3.6 కోట్లు.
తాజాగా ముంబై రోడ్లపై కపూర్ తన కొత్త కారుతో షికారు చేయడం మీడియా కంటపడింది.ఇప్పటికే రెండు పోర్షే కార్లను సొంతం చేసుకున్న రామ్, తాజాగా మరో పోర్షే కారును అదీ టాప్‌ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం విశేషం. రామ్ కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా నటి
పోర్షే 911 టర్బో S (992) విశేషాలు
అత్యంత అధునాతన మోడల్ 911 టర్బో S వేరియంట్, 560 PS గరిష్ట పపవర్ ను, 700 Nm నుండి భారీ 750 Nm టార్క్ వస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ PDK ట్రాన్స్‌మిషన్ ఇందులో ఉన్నాయి. ఇది కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇవేకాదు 2021లో, రామ్ కపూర్ రూ. 2 కోట్ల విలువైన పోర్షే 911 కారెరా ఎస్‌ని కొనుగోలు చేశారు. ఇంకా రూ. 4.5 కోట్ల విలువైన ఫెరారీ పోర్టోఫినో ఎం , పోర్టోఫినో M పవర్,మెర్సిడెస్-AMG G63 లాంటి లగ్జరీ కార్లు రామ్ కపూర్ సొంతం. వీటితోపాటు బీఎండబ్ల్యూ ఆర్ 18, ఇండియన్ రోడ్‌మాస్టర్ డార్క్ హార్స్ , బీఎండబ్ల్యూ K 1600 B సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి.