దేశీయ విఫణిలో 'పోర్స్చే ఇండియా' ఎట్టకేలకు రెండు లేటెస్ట్ కార్లను విడుదల చేసింది. అవి కయెన్ ఫేస్‌లిఫ్ట్, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్. కంపెనీ విడుదల చేసిన ఈ కార్ల ధరలు, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.
ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 1.36 కోట్లు కాగా, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 1.42 కోట్లు. అయితే డెలివరీలు 2023 జులై నెలలో ప్రారంభమవుతాయి.
డిజైన్:
ఒక్క చూపుతోనే ఆకర్షించే పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్డ్ ఫ్రంట్ ఫాసియాతో రీడిజైన్ పొందింది. ఇందులోని హెడ్‌లైట్, అల్లాయ్ వీల్స్ వంటివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్‌లను కనెక్ట్ చేసే లైట్‌బార్ ఉంటుంది.
ఇంటీరియర్ ఫీచర్స్:
పోర్స్చే కెయెన్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ డిజైన్ చూడవచ్చు. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ప్రయాణీకుల కోసం 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్, డాష్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన్ & పవర్‌ట్రెయిన్:
నిజానికి మార్కెట్లో ప్రస్తుతం కయెన్, కయెన్ కూపే బేస్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్‌తో 353 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.
అయితే త్వరలో విడుదలకానున్న ఈ మోడల్ ఈ-హైబ్రిడ్ వేరియంట్స్ అదే ఇంజిన్ కలిగి ఉన్నప్పటికీ e-మోటార్‌తో కలిసి 470 హెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 25.9kWh బ్యాటరీ 90 కిలోమీటర్ల పరిధిని మాత్రమే అందిస్తుంది. ఇది 11kW ఆన్-బోర్డ్ ఛార్జర్ ద్వారా సుమారు 2.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు.
ప్రత్యర్థులు:
భారతదేశంలో విడుదలైన కొత్త పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ8 వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment