ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సీ3 ముఖ్యమైన ఫీచర్ అప్‌డేట్‌లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఇది కేవలం టాప్-స్పెక్ షైన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. సీ3 ఆటోమాటిక్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 10.27 లక్షల మధ్య ఉన్నాయి.
సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. అయితే ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. డిజైన్ కొంత అప్డేట్ పొందినప్పటికీ.. ఫీచర్స్ జాబితాలో మాత్రం మాన్యువల్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ 1.2 లీటర్ టర్బో పిత్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment