
ప్రముఖ లగ్జరీ వాహన సంస్థ పోర్షే వచ్చే నెల నవంబర్ 12న టేకాన్ అనే ఎలక్ట్రిక్ కారును ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 93.4 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ టేకాన్ టర్బో, టర్బో ఎస్ మోడల్స్ కార్లను తీసుకురావాలని భావిస్తుంది. మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడీ తర్వాత మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. జర్మన్ బ్రాండ్ నవంబర్ 12న మాకన్ ఫేస్ లిఫ్ట్ కారుతో పాటు ఎలక్ట్రిక్ కారును తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది.
టేకాన్ టర్బో కారు 671 బిహెచ్ పీ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు టర్బో ఎస్ 1,050 ఎన్ఎమ్ టార్క్, 750.5 బిహెచ్ పీ పవర్ ఉత్పత్తి చేయనుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే పోర్షే టేకాన్ టర్బో కారును ఒకసారి ఛార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల రేంజ్, టర్బో ఎస్ 416 కిలోమీటర్ల రేంజ్ వెళ్లనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం 230 కిమీ/గం. ఒకే ఒక గేర్ ఉన్న చాలా ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా టేకాన్ రెండు గేర్లను కలిగి ఉంది. ఒకటి తక్కువ వేగం కోసం మరొకటి అధిక వేగం కోసం. ఎలక్ట్రిక్ పోర్స్చే టేకాన్ ధర సుమారు రూ.2 కోట్లు(ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
(చదవండి: యాపిల్‌కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..!)
Comments
Please login to add a commentAdd a comment