పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు | Instead Of Doli She Left In Arthi Mothers Mourn Porsche Victims | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు

Published Thu, May 23 2024 1:53 PM | Last Updated on Thu, May 23 2024 5:02 PM

 Instead Of Doli She Left In Arthi Mothers Mourn Porsche Victims

మైనర్‌లను డ్రైవింగ్‌కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ.  తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో  నడిపిన  యువకుడు రెండు  కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు  తిరిగి రాని  లోకాలకువెళ్లిపోయారన్న షాక్‌నుంచి  తేరుకోలేకపోతున్నారు.  కన్నీరుమున్నీరుగా విలపించారు. 

పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే  కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనిష్ అవధియా ,  అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి  బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

జబల్‌పూర్‌లో నివసించే  అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్‌లో  ఉన్నారు.  ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వంటి షరతులు)

"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు?  అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’  అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు.  

తను చాలా స్మార్ట్‌, ఇండిపెండెంట్‌, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.

“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి  హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే  ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా  గర్భశోకమిది. 

అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె.  ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్‌ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.

“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో  ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?"  కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement