నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్ | Saripodhaa Sanivaaram Movie OTT Release Date And OTT Platform | Sakshi
Sakshi News home page

Saripodhaa Sanivaaram OTT: అనుకున్నట్లుగానే ఓటీటీలో ఆ రోజే స్ట్రీమింగ్

Sep 21 2024 11:36 AM | Updated on Sep 21 2024 11:51 AM

Saripodhaa Sanivaaram Movie OTT Release Date Official

అనుకున్నట్లుగానే జరిగింది. నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.  థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా 'పేకమేడలు')

నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'సరిపోదా శనివారం'. వారంలో శనివారం మాత్రమే కోపాన్ని చూపించే వ్యక్తిగా నాని నటించాడు. కథ పరంగా ఓ మాదిరి కొత్తదనం ఉన్నప్పటికీ నాని-ఎస్జే సూర్య అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు.

ఆగస్టు 29న థియేటర్లలోకి ఈ సినిమాకు వర్షాలు అడ్డంకిగా మారాయి. రిలీజైన రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో నెలలోపో అంటే సెప్టెంబరు 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement